రోడ్డుపై నీరు వదులుతున్నారా... రూ.లక్ష ఫైన్ పడుతుంది జాగ్రత్త

మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది నీటిని రోడ్డుపైకి వదిలేస్తుంటారు. ఈ వార్త చదివితే మాత్రం షాక్ అవుతారు.

news18-telugu
Updated: September 30, 2020, 6:56 AM IST
రోడ్డుపై నీరు వదులుతున్నారా... రూ.లక్ష ఫైన్ పడుతుంది జాగ్రత్త
రోడ్డుపై నీరు వదులుతున్నారా... రూ.లక్ష ఫైన్ పడుతుంది జాగ్రత్త
  • Share this:
హైదరాబాద్... గచ్చిబౌలిలో జరిగిన ఓ ఘటన... సిటీలోని చాలా భవనాల యజమానులు షాక్ అయ్యేలా చేస్తోంది. ఎందుకంటే... రోడ్డుపై నీటిని వదిలినందుకు రూ.లక్ష ఫైన్ పడింది. అసలేం జరిగిందంటే.... వాసవీ జీపీ ట్రెండ్స్ బిల్డింగ్ మేనేజ్‌మెంట్... తమ సెల్లార్‌లోకి చేరిన నీటిని... మోటర్ సర్వీస్ ద్వారా... రోడ్డుపైకి వదిలింది. నానక్‌రామ్ గూడలోని ORR సర్వీస్ రోడ్డులో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర్లో ఉంది ఈ వాసవీ ట్రెండ్స్ బిల్డింగ్. ఇలా ఒక్కసారి కాదు... చాలాసార్లు ఈ మేనేజ్‌మెంట్... రోడ్డుపైకి నీటిని వదులుతోంది. అసలే అది సర్వీస్ రోడ్డు కదా... నీరు రాగానే... బురదలా మారుతోంది. వాహనదారులు తమ బైకులకు బ్రేక్ వేస్తే చాలు జర్రున జారుతున్నారు. కింద పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి అక్కడ.

ఒక్కోసారి వాహనాలు వేగంగా వెళ్లే పరిస్థితి లేక... ట్రాఫిక్ జామ్ కూడా అవుతోంది. దీనిపై ప్రజల నుంచి ఆగ్రహం రావడంతో... ఇదివరకు ఓసారి GHMC అధికారులు వచ్చి వార్నింగ్ ఇచ్చారు. అయినా మేనేజ్‌మెంట్ తీరు మారలేదు. మళ్లీ మళ్లీ అలాగే చేస్తోంది. పద్ధతి మార్చుకోనందుకు ఈ విషయాన్ని మంగళవారం జోనల్ కమిషనర్ రవికిరణ్ దృష్టికి తీసుకెళ్లి, రూ.లక్ష ఫైన్ విధించారు ట్రాఫిక్ ఎస్సై రవి.

రోడ్డుపైకి వచ్చేస్తున్న నీరు


అధికారులు ఇచ్చిన నోటీస్


అధికారులు వేసిన రూ.లక్ష ఫైన్ రసీదు


ఈ విషయం తెలిసి స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. కనీసం ఇప్పుడైనా రోడ్డుపైకి నీరు వదలకుండా ఉంటే చాలని అంటున్నారు. నిజానికి ఈ ఒక్క చోటే కాదు. హైదరాబాద్‌లోని చాలా రోడ్లపై ఇలా నీళ్లను వదిలేస్తున్నారు చాలా మంది. కొందరైతే... తమ ఇళ్లలో నీటి మోటర్లను ఆన్ చేసి ఉంచుతారు. వాటర్ సప్లై వారు నీటిని వదలగానే... ఆటోమేటిక్‌గా ఇళ్లలో ఉన్న సంపులు, ట్యాంకులూ నిండుతాయి. మిగతా నీరు... బయటకు వచ్చేస్తూ... అది అలా రోడ్డుపైకి వెళ్లిపోతుంది. పోతే పోనీ మాకేంటి... అనుకునే స్వభావంతో... మోటర్లను ఆఫ్ చెయ్యకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు చాలా మంది. ఇంకొందరైతే... స్నానాలు చేసిన నీటిని డ్రైనేజీలోకి వదలకుండా... రోడ్లపైకి వదిలేస్తున్న ఘటనలు చాలా ఉన్నాయి. ఇలా... రోడ్లు పాడవడానికి ఇలాంటి అంశాలు కూడా కారణం అవుతున్నాయి.
తాజాగా రూ.లక్ష ఫైన్ వేసిన అధికారులు... మిగతా వాళ్లపైనా ఇలాంటి చర్యలు తీసుకోవాలి. అప్పుడే నీరు వృథా అవ్వకుండా ఉంటుంది, ప్రమాదాలు జరగకుండా ఉంటాయి, రోడ్లు చక్కగా ఉంటాయి.
Published by: Krishna Kumar N
First published: September 30, 2020, 6:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading