హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: అంబులెన్స్‌కు దారివ్వని ట్రాఫిక్ పోలీస్.. వైద్య సిబ్బంది బతిమిలాడినా వినలేదు

Hyderabad: అంబులెన్స్‌కు దారివ్వని ట్రాఫిక్ పోలీస్.. వైద్య సిబ్బంది బతిమిలాడినా వినలేదు

అంబులెన్స్‌కు దారివ్వని ట్రాఫిక్ పోలీస్

అంబులెన్స్‌కు దారివ్వని ట్రాఫిక్ పోలీస్

ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓవరాక్షన్‌ను కొందరు వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ట్రాఫిక్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మీకు ప్రజల ప్రాణాల కన్నా రాజకీయ నాయకుల ప్రొటోకాలే ముఖ్యమా? అని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

ఇంకా చదవండి ...

రోడ్డుపై వెళ్తున్నప్పుడు అంబులెన్స్ సైరన్ వినపడితే వాహనదారులంతా పక్కకు తప్పుకుంటారు. అంబులెన్స్‌కు దారి ఇస్తారు. జనాల్లో అంతలా చైతన్యం వచ్చింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కాపాడాలంటే సకాలంలో వారిని ఆస్పత్రికి తరలించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రాణాలు పోయే ప్రమాదముంది. అందుకే అంబులెన్స్‌ల విషయంలో చాలా మందికి అవగాహన ఉంది. సైరన్ వినబడగానే వాటికి దారి ఇస్తారు. ఒకవేళ కూడళ్ల వద్ద సిగ్నల్ పడినా.. రెడ్, గ్రీన్‌తో సంబంధం లేకుండా ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్‌లను వదిలిపెడుతుంటారు. కానీ డ్యూటీలో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అంబులెన్స్‌కు దారివ్వకుండా ఓవర్ యాక్షన్ చేశాడు. ఎమర్జెన్సీలో ఉన్న అంబులెన్స్ కన్నా ప్రొటోకాలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించాడు. వాహనాలను వదలకుండా.. అంబులెన్స్‌కు దారివ్వకుండా.. చెలరేగిపోయాడు.

శనివారం సాయంత్రం ఓ అంబులెన్స్ బంజారాహిల్స్‌ వైపు వెళ్తోంది. మాసాబ్‌ట్యాంక్ వద్ద అది ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ఎంత సేపు సైరన్ మోగించినా.. ట్రాఫిక్ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. ఏంటా అని అంబులెన్స్ సిబ్బంది ఆరా తీస్తే.. అదే రూట్లో హోంమంత్రి మహమూద్ అలీ వెళ్తున్నారని తెలిసింది. ఆయన కాన్వాయ్‌ను క్లియర్ చేసేందుకు అన్ని వైపులా ట్రాఫిక్‌ను నిలిపివేశారని పక్కనున్న వాహనదారులు చెప్పారు. కానీ అంబులెన్స్‌లో ఉన్న రోగి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో అంబులెన్స్ సిబ్బంది కిందకు దిగి.. ట్రాఫిక్ పోలీస్ వద్దకు వెళ్లి మాట్లాడారు. పేషెంట్ కండిషన్ సీరియస్‌గా ఉందని ట్రాఫిక్ క్లియర్ చేయమని బతిమిలాడారు. ఐనా అతడు వినలేదు. హోమంత్రి కాన్వాయ్ వస్తోందని కాసేపు ఆగాలని చెప్పాడు. అంతేకాదు అంబులెన్స్ సైరన్ కూడా ఆపాలని.. ఏంటా గోల అంటూ రెచ్చిపోయాడు. ఆ తర్వాత ట్రాఫిక్ ఏసీపీ, సీఐ కలగజేసుకొని ఫ్రీ లెఫ్ట్ ద్వారా అంబులెన్స్‌‌కు దారిచ్చారు.


ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓవరాక్షన్‌ను కొందరు వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ట్రాఫిక్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మీకు ప్రజల ప్రాణాల కన్నా రాజకీయ నాయకుల ప్రొటోకాలే ముఖ్యమా? అని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆ పోలీసుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. సీపీతో పాటు వివరాలు తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అలా చేయకూడదని.. అంబులెన్స్‌లకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహించిన ట్రాఫిక్ పోలీసు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దర్యాప్తు అనంతరం అతడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.

First published:

Tags: Hyderabad, Hyderabad Traffic Police, Passenger traffic, Telangana

ఉత్తమ కథలు