హైదరాబాద్‌లో ఫైఓవర్ నిర్మాణంలో ఉన్న చాదర్‌ఘాట్, ఉప్పల్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. అంబర్‌పేట్ ఫ్లైఓవర్(Amberpet Flyover) నిర్మాణంలో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అంబర్‌పేట్ నుంచి గోల్నాక వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప్పల్ (Uppal) నుంచి వచ్చేవారు శ్రీరమణ థియేటర్, జిందా తిలిస్మాత్ రోడ్డు మీదుగా గోల్నాకకు వెళ్లాల్సి ఉంటుంది. చాదర్‌ఘాట్ నుంచి వచ్చేవాహనాలను నింబోలిఅడ్డా, ఫీవర్ ఆస్పత్రి తిలక్‌నగర్ మీదుగా రామాంతాపూర్‌కు(Ramanthapur) వరకు మళ్లిస్తారు. రాబోయే వర్షాకాలంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు అంతరాయం కలగకుండా.. నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఉండేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు ట్రయల్ రన్ చేసి ఇబ్బందులు గుర్తించామని ఆయన తెలిపారు. సమస్యలను పరిష్కరించేందుకే ట్రాఫిక్‌ను మల్లిస్తున్నామని తెలిపారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు దాదాపు మూడు నెలల వరకు కొనసాగుతాయని వెల్లడించారు. నగరవాసులంతా గుర్తించాలని.. పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ట్రాఫిక్ రూట్‌కు సంబంధించిన మ్యాప్‌ను విడుదల చేశారు. దీనిని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.
నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వంశ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగానే ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను నిర్మించింది. ప్రస్తుతం నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల అతిపెద్ద ఫ్లైఓవర్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. షేక్‌పేట్‌లో ఆరులైన్ల ఫ్లైఓవర్‌ను నిర్మించారు. శంషాబాద్‌లోనూ భారీ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది.
CM KCR | Centre : ఉద్యోగులకు 50 శాతం జీతాలు! -అప్పులపై కేంద్రం ఆంక్షలతో కటకట -కేసీఆర్ కాంప్రమైజ్?
నగరంలో మరిన్ని ఫ్లైఓవర్లను నిర్మిస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. దుర్గం చెరువులో కేసీఆర్ సర్కార్ నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హైదరాబాద్ నగరంలో ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తమ ప్రభుత్వం వీలైనన్ని చర్యలు తీసుకుంటోందని.. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని మంత్రి కేటీఆర్ అనేకసార్లు నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.