తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు వేడుక సందర్భంగా బుధవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగనున్నాయి. అన్నిటికంటే హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తోన్న ప్లీనరీ ప్రధానం కానుంది. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్‌లో జరుగుతోన్న టీఆర్ఎస్ ప్లీనరీలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి 3వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. కేసీఆర్ జాతీయ ప్రణాళిక సహా కీలక అంశాలను ప్రకటించబోయే ప్లీనరీ నేపథ్యంలో నగరంలో నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ప్రకటించారు పోలీసులు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలను పురస్కరించుకుని పలు ట్రాఫిక్ మార్గదర్శకాలు అమలు చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఇవాళ ట్రాఫిక్ ఉండబోయే మార్గాలు, ప్రత్యామ్నాయ దారుల వివరాలివే..
టీఆర్‌ఎస్ 21వ ఆవిర్భావ వేడుకలు నగరంలో హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్నారు. దీంతో హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాలైన కొత్తగూడ-హైటెక్స్, సైబర్ టవర్స్-ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్-కొత్తగూడ ప్రాంతాల్లోని కార్యాలయాల నిర్వాహకులు పనివేళల్లో స్వల్ప మార్పులు చేసుకోవాలని సూచించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంటుందని, ఈ సమయాల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
ట్రాఫిక్ ఉండే మార్గాలు: 1)నీరూస్ జంక్షన్-సైబర్ టవర్స్ జంక్షన్-మెటల్ చార్మినార్ జంక్షన్-గూగుల్(సీఐఐ) జంక్షన్-కొత్తగూడ జంక్షన్ రోడ్డు. 2)మెటల్ చార్మినార్ జంక్షన్-ఖానామెట్ జంక్షన్-హైటెక్స్/హెఐసీసీ/ఎన్‌ఏసీ రోడ్డు. 3)జేఎన్‌టీయూ-సైబర్ టవర్స్ -బయోడైవర్సిటీ జంక్షన్. 4)గచ్చిబౌలి జంక్షన్-బొటానికల్ గార్డెన్ జంక్షన్- కొత్తగూడ జంక్షన్-కొండాపూర్ జంక్షన్లు.
ప్రత్యామ్నాయ మార్గాలు: 1)నీరూస్ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వెళ్లే వారు సీఓడీ(మాదాపూర్ అయ్యప్ప సొసైటీ) నుంచి దుర్గం చెరువు-ఇనార్బిట్-ఐటీసీ కోహినూర్-ఐకియా-బయోడైవర్సిటీ-గచ్చిబౌలి మీదుగా సైబర్ టవర్స్ వైపునకు వెళ్లకుండా రాకపోకలు సాగించాలి.
2)మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట్ ప్రాంతాలనుంచి వచ్చే వారు హైటెక్ సిటీ- సైబర్ టవర్స్-జూబ్లీహిల్స్ వచ్చే వాహనాలు రోల్లింగ్ హిల్స్ ఏఐజీ హాస్పిటల్-ఐకియా-ఇనార్బిట్-దుర్గం చెరువు రోడ్డులో ప్రయాణించాలి.
3)ఆర్‌సీపురం, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు బీహెచ్‌ఈఎల్-నల్లగండ్ల-హెచ్‌సీయూ-ట్రిపుల్ ఐటీ-గచ్చిబౌలి రోడ్డులో కొండాపూర్, ఆల్విన్ రోడ్డు వైపునకు వెళ్లకుండా రాకపోకలు సాగించాలి. అని పోలీసులు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Hyderabad, Hyderabad Traffic Police, Trs