ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కొన్నిసార్లు ఎలాంటి నేరం చేయని వారికి కూడా షాక్ ఇస్తుంటుంది. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం సిద్దిపేటలో రోడ్డుపై అతి వేగంగా వెళుతున్న కారు నెంబర్ TS 15 EV 0564 ఫొటో తీసిన పోలీసులు.. ఆ కారు యజమానికి జరిమానా విధించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఓవర్ స్పీడ్‌తో వెళుతున్న కారు యజమానులకు ఇలాంటి ఫైన్లు వేయాల్సిందే. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ కారు నంబర్‌కు పోలీసులు వేసిన జరిమానా.. ఓ బైక్ యజమానికి పడింది. అతడి ఫోన్ నంబర్‌కు ఇందుకు సంబంధించిన మెసేజ్ వెళ్లింది.
ఫోర్ విల్లర్ కారుకు ఫోటో తీసిన పోలీసులు.. ఇందుకు సంబంధించిన ఫైన్‌ను కాస్త నారాయణఖేడ్‌లో ఉన్న బైక్‌కు వేశారు. నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామంలో ఇంట్లో ఉన్న టు విల్లర్ బైక్ నెంబర్ TS 15 EY 0564 కు 1035 రూ. ఫైన్ వేసినట్లు మెసేజ్ వచ్చింది. మెసేజ్ చేసుకున్న బైక్ యజమాని.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు తాను ఈ మధ్య సిద్ధిపేటకు వెళ్లలేదని.. అలాంటప్పుడు ఈ ఫైన్ ఎలా వచ్చిందని షాక్ అయ్యాడు.
అసలు ఈ పొరపాటు ఎలా జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అయితే కారు, బైక్ నంబర్ దాదాపుగా ఓకే రకంగా ఉండటం వల్లే ఇలా జరిగిందని ఆ తరువాత అతడికి అర్థమైంది. కారు నంబర్లో ఉన్న V అక్షరానికి బదులుగా Y కొట్టడంతో ఇలా జరిగింది. ఒక్క అక్షరం పొరపాటుతో ఫోర్ వీలర్‌కు రావాల్సిన ఫైన్ మెసేజ్ కాస్త బైక్ యజమానికి వచ్చింది. ఈ పొరపాటను సరి చేయాలని బాధితులు పోలీసులను కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana, Traffic challan, Traffic police