TRACTOR TURNS UPSIDE DOWN 3 KILLED IN KAMAREDDY SK
Tractor Accident: పెళ్లింట విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు దుర్మరణం
ట్రాక్టర్ బోల్తా
Kamareddy tractor accident: పెళ్లి కోసం నీటిని తీసుకెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మరణించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్నదేవడా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పెళ్లితో కళకళలాడాల్సిన ఇంట్లో విషాద ఛాయలు అలుముుకున్నాయి. ఓ రోడ్డు ప్రమాదం ఊరు మొత్తాన్ని శోకసంద్రంలో ముంచేసింది. పెళ్లి కోసం నీటిని తీసుకెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి.. ముగ్గురు మరణించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్నదేవడా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన బిచ్కుంద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను చిన్నదేవడా గ్రామానికి చెందిన తుకారం, మద్నూర్‌కు చెందిన శంకర్, బిచ్కుందకు చెందిన సాయిలుగా గుర్తించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో పెళ్లి పనులు ఆగిపోయాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.