అక్రమ సంబంధాల ఫలితం చివరికి మనిషి ప్రాణాలను హరించివేస్తోంది. భార్య,భర్తల మధ్య వ్యవహారం బయటకు రావడంతో పాటు సమాజంలో ఓ రకమైన చర్చ ఈ సంబంధాల ద్వార బయటపడడంతో ఇద్దరి మనస్పర్థలు తలెత్తడం ఆ తర్వాత ఒకరిపై ఒకరు హత్యలకు పాల్పడడం లాంటీ సంఘటనం నిత్యాకృత్యమయ్యాయి.. క్షణికావేశంలో హత్యలు చేయడం ఆ తర్వాత జైలుకు వెళ్లడం సాధారణంగా మారిపోయింది. కాగా తాజాగా ఓ అక్రమ సంబంధం కేసులో ఓ వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం నెరపుతుండడంతో దారుణంగా హత్య చేశాడు.. దారిన పోతున్న వాడిని తన ట్రాక్టర్‌తో ఢికొట్టాడు. ఆ బురదలో తొక్కి ప్రాణాలు తీశాడు.
వివరాల్లోకి వెళితే..సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన మహెష్ అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే రైతు భార్యతో అక్రమ నెరిపాడు. దీంతో ఇరువురి మధ్య పంచాయితీ నిర్వహించి సర్థిచెప్పారు. దీంతో అప్పటి నుండి నాగరాజు మహెష్ పై కక్ష పెంచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇటివల కూడా మహెష్, తన భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానాలు మరోసారి నాగరాజులో రేకెత్తాయి.. దీంతో మరింత కక్షను పెంచుకున్నాడు ఎలాగైనా మహేష్‌ను మట్టబెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీంతో సమకోసం వేచి చూశాడు.
Telangana RTC : ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త.. జిల్లా బస్సుల్లో మరో వెసులుబాటు
దీంతో ఇటివల ఆ సమయం వచ్చింది. నిన్న మహేష్‌తో పాటు నాగరాజు కూడా పోలం పనులకు వెళ్లారు. సాయంత్రం పనులు ముగించుకుని ఇద్దరు బయలు దేరారు. కాగా మహేష్ తన టూవీలర్ మీద తన ఇంటికి వెళుతున్నాడు. కాగా నాగరాజు కూడా కూలీలను తీసుకుని గ్రామానికి వెళ్లాడు. అదే సమయంలో మహేశ్ తన కంటపడ్డాడు.. ఒంటిరిగా వెళుతుండడం చీకటి కూడా పడుతుండడంతో ఎవరు చూడరని భావించాడు. వెంటనే కూలీలను గ్రామంలో దించేసి వెంటనే తిరిగి పొలానికి వెనుదిరిగాడు...ఎదురుగా వస్తున్న మహేష్ టూ వీలర్ నేరుగా ట్రాక్టర్‌తో ఢికొట్టాడు. దీంతో మహేష్ పక్కనే ఉన్న పొలం మడిలో టూ వీలర్‌తో పాటు పడిపోయాడు.
KTR on JP Nadda : జేపీ నడ్డాకు మెంటలే.. ఆయన ఓ అబద్దాల అడ్డా.. మిగిలింది.. ఎర్రగడ్డే...
అంతటితో ఆగని నాగరాజు కక్షపూరితంగా వ్యవహరించాడు.దారుణానికి తెగబడ్డాడు.. పొలంలో పడిన మహేష్ పై నుండి ట్రాక్టర్ పోనిచ్చాడు.. పలు అటు ఇటు తిప్పి బురదలోనే తన మోటారు సైకిల్‌తో పాటు తొక్కిపడేశాడు. ఆతర్వాత తాపిగా వెళ్లాడు.. ట్రాక్టర్‌ను కొద్ది దూరంలో ఆపేసి ఇంటికి పరుగులు తీశాడు.. రాత్రి సమయం కావడంతో ఎవరు మహేశ్‌ను గమనించలేదు.. తెల్లవారుజామున పోలానికి వచ్చిన గ్రామస్థులు గమనించి శవాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. పాత కక్షలతోనే నాగరాజు ఇలా వ్యవహరించాడని భావించిన పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.