హోమ్ /వార్తలు /తెలంగాణ /

Big Breaking: తెలంగాణ కాంగ్రెస్ కు మరో భారీ షాక్.. జగ్గారెడ్డి రాజీనామా?

Big Breaking: తెలంగాణ కాంగ్రెస్ కు మరో భారీ షాక్.. జగ్గారెడ్డి రాజీనామా?

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ కు మరో భారీ షాక్ తగలనుందా? ఏకంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీకి రాజీనామా చేయనున్నారా? ప్రస్తుతం జరుగుతున్న సమీకరణాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం అవుననే అనిపిస్తోంది. ఆ పార్టీ కీలక నేత, వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేపు సంగారెడ్డిలో నిర్వహించనున్న కార్యకర్తల సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తనను కోవర్టు అంటూ రేవంత్ వర్గం ప్రచారం చేస్తోందని ఆయన తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

First published:

Tags: Jagga Reddy, Revanth Reddy

ఉత్తమ కథలు