Home /News /telangana /

TPCC PRESIDENT REVANTH REDDY HOUSE ARREST AT JUBLEEHILLS VRY

Revanth reddy : గాంధీ జయంతి కాబట్టె శాంతియుతంగా ఉన్నాం.. కేసిఆర్‌ను తరిమికొట్టడడం ఖాయం.. !

Revanth reddy

Revanth reddy

Revanth reddy : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన జంగ్ సైరన్ పిలుపు పూర్తిస్థాయిలో సక్సెస్ కాకుండా పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డిని బయటికి రాకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై మండిపడ్డారు.

ఇంకా చదవండి ...
  ఈ నేపథ్యంలోనే.. రేవంత్ రెడ్డి ( Revanth reddy ) సీఎం కేసిఆర్‌తో పటు ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. పార్టీ తలపెట్టిన ర్యాలీని అడ్డుకున్నా. మలి అడుగు పాలమూరు యూనివర్సిటీ లో పెడతామని హెచ్చరించారు..అయితే నేడు శాంతికి చిరునామా అయినా.. గాంధీ జయంతి కావడం తో మౌనం గా భరిస్తున్నామని చెప్పారు .

  అందుకే ఈ ప్రశాంతంగా శాంతియుతంగా నిరసన తెలిపామని చెప్పారు.. అయితే సీఎం కేసీఆర్ ను పొలిమేర్లు తరిమే వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు..మరోవైపు సీఎం కేసీఆర్ ( cm kcr )ఉద్యమ స్ఫూర్తి ని మంటలో కలిపారని ఆయన మండిపడ్డారు..నాలుగు కోట్ల ప్రజల హక్కు లను కాల రాశారని అన్నారు....ఏడున్నర ఏళ్ల నుంచి ప్రభుత్వం లోని ఖాళీ లను భర్తీ చేయకుండా మోసం చేస్తున్నారని ఫైర్ అయిన రేవంత్ రెడ్డి,పేద విద్యార్థులకు ఉన్నత విద్య దక్కకుండా.. ఫీజు రీయింబర్స్మెంట్ ను ఎత్తేశారని అన్నారు...చేపలు, బర్రెలు, గొర్రెలు పెంచుకోవాలంటూ పేద పిల్లలను చదువు కు దూరం చేసే కుట్రకు తెర లేపారని అన్నారు...

  ఇది చదవండి : కేసీఆర్ ప్రభుత్వాన్ని అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.


  విద్య విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శ్రద్ద వహించందని ఆయన గుర్తు చేశారు. ప్రతీ పేద వాని బిడ్డకు ఉచితంగా విద్యను ( free education ) అందించాలని ఇందిరా గాంధీ చట్టం తీసుకొచ్చారని...పోరాడి సాధించుకున్న తెలంగాణలో చదువులకు దూరం చేస్తున్నారు.ఇక ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం 4 వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయని ఆయన చెప్పారు..వనపర్తి లో లావణ్య అనే దళిత బిడ్డ ఆత్మహత్య.. ప్రభుత్వం చేసిన హత్య.ప్రభుత్వం నియమించిన బిస్వాల్ కమిటీ ప్రకారం తెలంగాణ లో 1.92 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయి.

  తెలంగాణ వచ్చాక రిటైర్మెంట్ అయిన స్థానంలో కొలువులు భర్తీ చేయలేదన్నారు.. మలిదశ తెలంగాణ ఉద్యమం లో ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి కి నివాళ్లర్పించడానికి ప్రభుత్వం నిరాకరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు...వేలాది మంది పోలీసులతో.. ఎల్బీనగర్ లో మోహరించారని,శ్రీకాంతాచారి ఏమైనా అంతర్జాతీయ తీవ్రవాదినా.. నివాళ్లు అర్పించడానికి అర్హత కూడా లేదా..కేసీఆర్, కేటీఆర్ లను మాత్రమే పొగడాలా.. అంటూ తీవ్రంగా మండిపడ్డారు.. ఇలాంటీ చర్యలకు పాల్పడడం ద్వారా..అమరుల త్యాగాలను .. చెరిపేయాలనే కుట్ర చేస్తున్నారని అన్నారు...

   ఇది చదవండి : రాంగ్ రూట్‌లో మంత్రి కేటీఆర్ కారు.. అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసు..!


  వందలాది మంది అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ లో వారి స్మరించుకోకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారు.కాంగ్రెస్ నేతలు హౌజ్ అరెస్ట్ లతో నిరంకుషంగా వ్యవహరిస్తోంది.మేధావులు బయటకు రావాలని ఆయన కోరారు.. ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచన చేయాలి.లక్షలాది మంది ఆకలి పోరాటానికి సిద్ధం కావాలి.ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ స్ఫూర్తి ఎక్కడ పోయింది.. పోలీసు ఉక్కు పాదాల మధ్య నలిపేయాలని చూస్తున్నారు.ఉద్యోగ నియామకాలు లేకపోవడంతోనే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.కేసీఆర్ కుటుంబాన్ని వెయ్యి అడుగుల గోతితీసి, లక్షలాది మంది విద్యార్థులతో పరేడ్ గ్రౌండ్లో కవాతు చేస్తామని నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Congress, Revanth reddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు