Home /News /telangana /

TPCC KEY LEADER ADDANKI DAYAKAR COMPLAINTS TO HIGH COMMAND ON KOMATIREDDY UTHAM REDDY NS

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో మరో కొత్త లొల్లి.. ముగ్గురు కీలక నేతలపై హైకమాండ్ కు ఫిర్యాదు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ కాంగ్రెస్ (TS Congress) లో మరో కొత్త పంచాయతీ తెర మీదకు వచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ కీలక నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై సీనియర్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ (Addanki Dayakar) హైకమాండ్ కు లేఖ రాశారు.

ఇంకా చదవండి ...
  తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) లో మరో కొత్త పంచాయితీ మొదలైంది. ఇటీవల రాహుల్ గాంధీతో సీనియర్ల భేటీ అనంతరం పరిస్థితులన్నీ చక్కబడి నేతలంతా ఒక్కతాటిపైకి వస్తారన్న వాతావరణం కనిపించింది. అయితే ఇది జరిగి వారం కాకముందే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. కాంగ్రెస్ (Congress Party) కంచుకోటగా చెప్పబడే ఉమ్మడి నల్లగొండ జిల్లా (Nalgonda District) నేతల్లో భగ్గుమన్న విభేదాలు ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న అద్దంకి దయాకర్ రాహుల్ గాంధీకి (Rahul Gandhi) లేఖ రాయడంతో ఈ వివేదాలు బయటకు పొక్కాయి. తాను గతంలో రెండు సార్లు పోటీ చేసి స్పల్పతేడాతో ఓడిపోయిన తుంగతుర్తి (Thungaturthy Assembly) నుంచి తనను బయటకు పంపే పరిస్థితి ఏర్పడిందని అద్దంకి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం నిరంతరం పోరాడుతున్న తమలాంటి వారికి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తనపై రెబల్ గా పోటీ చేసి తన ఓటమికి కారణమైన వడ్డేపల్లి రవిని మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చేందుకు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్, భువనగరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ అద్దంకి ఆరోపిస్తున్నారు.

  రాహుల్ గాంధీ పోటీ చేయవద్దని చెప్పినా పోటీ చేసి పార్టీని దెబ్బతీసిన రవిని మళ్లీ పార్టీలోకి ఎలా తీసుకువస్తారంటూ ఆయన సీనియర్లను ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు రాహుల్, సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోరారు అద్దంకి దాయకర్. రేపు లేదా ఎల్లుండి ఆయన అగ్రనాయకత్వంతో సమావేశమయ్యే అవకాశం ఉంది. 2014 ఎన్నికల సమయంలో టీజేఏసీ నుంచి కాంగ్రెస్ లో చేరిన అద్దంకి దయాకర్ ఆ సమయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నుంచి పోటీ చేసి సుమారు 2 వేల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.
  Rahul Gandhi visit to Telangana: తెలంగాణకు రాహుల్​ గాంధీ రాక ఫిక్స్​.. ఆ జిల్లాలో కాంగ్రెస్​ పార్టీ బహిరంగ సభ.. వివరాలివే..

  మరో సారి 2018 నుంచి కూడా తుంగతుర్తి నుంచి పోటీ చేసి కేవలం 1800 ఓట్ల తేడాతో మరో సారి ఓటమి మూటగట్టుకున్నారు. అయితే.. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వడ్డేపల్లి రవికి 2700 ఓట్లు వచ్చాయి. అయితే.. రవి పోటీ చేయకపోతే తాను తప్పక విజయం సాధించేవాడినని అద్దంకి చెబుతున్నారు. అయితే మొన్నటి వరకు అద్దంకి దయాకర్ కు అండగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ అనూహ్యంగా ఇప్పుడు రవికి మద్దతు తెలపడం నల్లగొండ జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
  BJP| Telangana: తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు.. సీఎం కేసీఆర్​పై ఈటల ధ్వజం

  అద్దంకి దయాకర్ టీపీసీసీ చీఫ్ తో సన్నిహితంగా ఉండడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ కోపానికి కారణమన్న చర్చ సాగుతోంది. ఇంకా రాంరెడ్డి దామోదర్ రెడ్డితో అద్దంకి దయాకర్ కు చాలా రోజులుగా విభేదాలు ఉన్నాయి. తనను నియోజకవర్గానికి రాకుండా దామోదర్ రెడ్డి బెదిరిస్తున్నారంటూ కొన్ని నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు అద్దంకి. అయితే.. ఆ వివాదం సమసిపోయిందని అంతా భావిస్తున్న ఈ సమయంలో మళ్లో సారి అద్దంకి అధిష్టానానికి లేఖ రాసి బాంబ్ పేల్చారు. అయితే.. ఈ అంశంపై కాంగ్రెస్ హై కమాండ్ ఎలాంటి తీసుకుంటుందనే అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Komatireddy venkat reddy, Revanth Reddy, Tpcc, TS Congress

  తదుపరి వార్తలు