హోమ్ /వార్తలు /తెలంగాణ /

Revanth Reddy: ఆ చట్టం ప్రకారం ఒక్క గింజ కొనకపోయినా అది నేరమే.. రాష్ట్ర ప్రభుత్వంపై పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి ధ్వజం

Revanth Reddy: ఆ చట్టం ప్రకారం ఒక్క గింజ కొనకపోయినా అది నేరమే.. రాష్ట్ర ప్రభుత్వంపై పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి ధ్వజం

Revanth reddy

Revanth reddy

రైతుల పంటలకు దళారులు ధర నిర్ణయిస్తున్నారని రేవంత్​ చెప్పారు. ఆ నాడు కాంగ్రెస్​ ప్రభుత్వం ఇలాంటి వారిపై పీడీ యాక్డు పెట్టేలా చర్యలు తీసుకుందని గుర్తుచేశారు. కేంద్రం నిర్ణయించిన ధరకు రాష్ట్రం పంటను కొనకపోతే అది నేరం కిందకే వస్తుందని రేవంత్​ అన్నారు.

ఇంకా చదవండి ...

వరి పంట వేస్తే ఉరేనన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​.. తన 150 ఎకరాల్లో వరి వేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (TPCC chief Revanth Reddy) తెలిపారు. మీడియాతో మాట్లాడిన రేవంత్.. రైతు సమస్యలపై (On farmer issues) ప్రభుత్వం వింత వైఖరి అవలంభిస్తోందన్నారు. రైతుల పంటలకు దళారులు ధర నిర్ణయిస్తున్నారని చెప్పారు. ఆ నాడు కాంగ్రెస్​ ప్రభుత్వం ఇలాంటి వారిపై పీడీ యాక్టు పెట్టేలా చర్యలు తీసుకుందని గుర్తుచేశారు రేవంత్​. కాగా, పంటలకు ధర నిర్ణయించే హక్కు రైతులకు (farmers) లేకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయించిన ధరకు రాష్ట్రం పంట (crop)ను కొనకపోతే అది నేరం కిందకే వస్తుందని రేవంత్​ అన్నారు. ఇది ఉల్లంఘిస్తే కనీస మద్దతు ధర (MSP) చట్టాన్ని ఉల్లఘించినట్లే అవుతుందని రేవంత్​ తెలిపారు. ఒకవేళ కొనకపోతే దళారులు రేట్లు నిర్ణయించే పరిస్థి వస్తుందని అన్నారు.

పంజాబ్​, హర్యానాలో కేంద్రం కొనుగోలు చేస్తోంది..

పంట కొనుగోలు (Buy the crop) విషయంలో కేంద్రం, రాష్ట్రం అయోమయంలో నెడుతున్నారని తెలిపారు. ఫుడ్ కార్పేరేషన్​ ఆఫ్​ ఇండియా (Food Corporation of India) దగ్గర బఫర్​ స్టాక్​ ఉంచుకుంటుందని, మార్కెట్​లో షార్టేజ్​ వచ్చినా.. విపత్కర పరిస్థితులు తలెత్తినా ఎఫ్​సీఐ ఆ పంటను అందిస్తుందని రేవంత్ అన్నారు. పంజాబ్​, హర్యానాలో కేంద్రం కొనుగోలు చేస్తోందని పీసీసీ చీఫ్​ తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో కేంద్రం నేరుగా మండీ విధానంలో కొంటోందని, కానీ, ఇక్కడ ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని రేవంత్​ అన్నారు.

తిరుగుబాటు తప్పదు..

మోదీ ప్రభుత్వం (Modi government) కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని రేవంత్ మండిపడ్డారు. యూపీ, పంజాబ్‌ ఎన్నికల (UP, Punjab Elections) కోసమే సాగుచట్టాలు రద్దు చేశారని వ్యాఖ్యానించారు. ఎంఎస్‌పీ విధానం తెచ్చింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. రైతుల్ని బానిసలుగా చేయాలని చూస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రైతు ఉద్యమంలో చనిపోయినవారి కుటుంబాలకు కేంద్రం సాయం చేయలేదని, కనీసం వారి వివరాలు కూడా సేకరించలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. రైతులను బానిసలుగా (Slaves) చూస్తున్నారని అన్నారు రేవంత్​, నల్ల చట్టాలైన వ్యవసాయ చట్టాలను (Farmers laws) అందరూ వ్యతిరేకించినా తీసుకొచ్చారని మళ్లీ వాళ్లే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో పార్లమెంటులో బిల్లును వెనక్కి తీసుకున్నారని రేవంత్​ తెలిపారు.


ఇలా నల్ల చట్టాలను రద్దు చేశారో లేదో.. వెంటనే నరేంద్ర సింగ్ తోమర్ (Narendra Singh Tomar)​ మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకొస్తామని ప్రకటించారని రేవంత్ మండిపడ్డారు. ఇవన్నీ ఎన్నికల జిమ్మిక్కులని కేవలం ఉత్తరప్రదేశ్, పంజాబ్​ తదితర రాష్ట్రాల్లో ఎన్నికల కోసమే చట్టాలను రద్దు చేశారని రేవంత్ ఆరోపించారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Congress, Revanth reddy, Telangana

ఉత్తమ కథలు