హోమ్ /వార్తలు /తెలంగాణ /

Tollywood drugs case: డ్రగ్స్​ కేసు వ్యవహారంలో ఈడీ కార్యాలయానికి టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి.. జాయింట్​ డైరెక్టర్​తో భేటీ

Tollywood drugs case: డ్రగ్స్​ కేసు వ్యవహారంలో ఈడీ కార్యాలయానికి టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి.. జాయింట్​ డైరెక్టర్​తో భేటీ

టాలీవుడ్​ డ్రగ్స్ కేసుకు సంబంధించిన డిజిటల్ రికార్డులను ఈడీకి అప్పగించాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి రెండో తేదిన ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేవంత్​ ఈడీ జాయింట్​ డైరెక్టర్​ను కలిశారు.

  టాలీవుడ్ డ్రగ్స్ (Tollywood Drugs case) కేసుకు సంబంధించి గతంలో ఎక్సైజ్ శాఖ విచారణ చేసింది. అయితే ఈ కేసులో సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఈ విషయమై విపక్షాలు ప్రభుత్వం తీరుపై విరుచుకు పడ్డాయి. దీంతో రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టు (Telangana high court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈడీ  కార్యాలయంలో శుక్రవారం నాడు జాయింట్ డైరెక్టర్​ కు టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఆధారాలను టీపీసీసీ చీఫ్ రేవంత్​ రెడ్డి ( TPCC Chief Revanth Reddy) సమర్పించారు. డ్రగ్స్​ కేసు (Drugs case)ను రాష్ట్ర ప్రభుత్వం తొక్కి పెట్టిందని రేవంత్​ ఆరోపించారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సేకరించిన సమాచారాన్ని ఇవ్వాలని హైకోర్టు ఎక్సైజ్​ శాఖను ఆదేశించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పటి వరకు కూడా ఎక్సైజ్ శాఖ ఈడీకి ఈ సమాచారాన్ని ఇవ్వలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయమై సమాచారం ఇవ్వకపోతే తమకు చెప్పాలని కూడా ఈడీకి హైకోర్టు సూచించిందన్నారు.

  ఎక్సైజ్ శాఖ నుంచి సమాచారం ఇవ్వకపోయినా కూడా ఈడీ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని రేవంత్ రెడ్డి (Revanth reddy) ప్రశ్నించారు. తాము సేకరించిన సమాచారాన్ని ఈడీతో పంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 2017లో డ్రగ్స్ కేసులో 12 FIR లు హడావుడిగా నమోదు చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అప్పట్లో ఈ కేసును విచారణ చేసిన అధికారి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదని రేవంత్ రెడ్డి చెప్పారు.

  తెలంగాణలో గుట్కా లేదు, మట్కా లేదని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కానీ, గల్లీ గల్లీలో గంజాయి, గుట్కా గుప్పు మంటుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ లేకండా చేసేందుకు వెయ్యి మంది సిబ్బందితో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తుననామని సీఎం కేసీఆర్ చెప్పారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇదంతా చూసిన తాను సీఎం కేసీఆర్ (CM KCR) మారాడని భావించానన్నారు. కానీ సీఎం కేసీఆర్ లో మార్పు రాలేదని టాలీవుడ్ డ్రగ్స్ కేసును చూస్తే అర్ధమౌతుందన్నారు. హైద్రాబాద్ లో కొత్తగా 90 పబ్​లకు అనుమతులు ఇచ్చారన్నారు.

  టాలీవుడ్​ డ్రగ్స్ కేసుకు సంబంధించిన డిజిటల్ రికార్డులను ఈడీకి అప్పగించాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి రెండో తేదిన ఆదేశించింది. ​ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో ఈడీ కూడా ఇంప్లీడ్ అయింది.  డ్రగ్స్ కేసులో డ్రగ్ పెడ్లర్ కెల్విన్​ నిర్వహించిన లావాదేవీలను విచారిస్తే కీలక విషయాలు బయట పడే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి గతంలో పలుమార్లు మీడియా వేదికగా చెప్పిన సంగతి తెలిసిందే.

  First published:

  Tags: Revanth Reddy, Tollywood drug case

  ఉత్తమ కథలు