Home /News /telangana /

TPCC CHIEF REVANTH REDDY ALLEGED THAT CM KCR WAS COMING TO CHEAT MUNUGODU PEOPLE PRV

Revanth reddy: ‘‘మునుగోడు ప్రజలకు మోసం చేయడానికి ఆయన బయలుదేరారు’’: రేవంత్​ రెడ్డి

రేవంత్ రెడ్డి​ (ఫైల్​)

రేవంత్ రెడ్డి​ (ఫైల్​)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజలపై పడుతున్న భారంపై మునుగోడు ఉప ఎన్నికలో చర్చ జరగాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మనుగోడు ఉపఎన్నికను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ (Congress MLA Komatireddy Rajagopal) రెడ్డి రాజీనామాతో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.  మరికొన్ని నెలల్లో మునుగోడులో ఉప ఎన్నిక (Munugodu By election) రాబోతుంది.  ఈ నేపథ్యంలో ఆయా రాజకీయా పార్టీలు తమ ప్రచారాన్ని మొదలుపెట్టే పనిలో ఉన్నాయి. ఈ సందర్భంలో అధికార, ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అయితే మునుగోడు ఎన్నికలోనే తెలంగాణపై చర్చ జరగాలంటున్నాయి ప్రతిపక్షాలు. ఈ ఉప ఎన్నికలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజలపై పడుతున్న భారంపై చర్చ జరగాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC chief Revanth Reddy) అన్నారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం పోస్టుచేశారు రేవంత్​. మనుగోడు ఉపఎన్నికను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ సమస్యల ప్రతిపాదికన జరగాల్సిన చర్చ కాస్తా.. వ్యక్తిగతమైన విమర్శలు, పరుష పదజాలంపై చర్చ జరుగుతుందన్నారు. దీనివల్ల తెలంగాణ సమాజానికి, మునుగోడు ప్రజలకు నష్టం జరుగుతుందని అన్నారు.

    రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, పెరిగిన నిత్యావసర ధరలపై చర్చ జరగాలని అన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. 8 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) నిర్ణయాల వల్ల.. పేదలపై పడిన భారం గురించి చర్చ జరగాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలపై భారం వేసి.. బతకడమే కష్టంగా మార్చిందని విమర్శించారు.



    ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని ఆరోపించారు. బీజేపీ పాలనలో పేదలు, నిరుద్యోగులు, రైతులు.. చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ ఓట్లు అడగాలంటే.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పరిష్కరించడానికి వారి ప్రణాళికలను చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడు నియోజకవర్గానికి కేంద్రంలోని బీజేపీ రూ. 5 వేల కోట్లు ప్రకటించి.. అక్కడి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆ పని చేసి బీజేపీ ఓట్లు అడిగితే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.



    కేసీఆర్ చెప్పిందే చెప్పి..

    రేవంత్ మాట్లాడుతూ..  2014 నుంచి కేసీఆర్ చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మళ్లీ మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరారని రేవంత్​ మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, దళితులకు 3 ఎకరాలు.. ఏ హామీని కూడా కేసీఆర్​ పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా.. ఓటు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు వివాదాల జోలికి వెళ్లకుండా.. ప్రజా సమస్యలపై పోరాడాలని కోరారు. కమ్యూనిస్టులు, కోదండరాం మద్దతు కోరతామని చెప్పారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, Hyderabad, Revanth Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు