పరిషత్ పోరులో గెలుపెవరిది... హోరాహోరీగా తలపడుతున్న టీఆర్ఎస్, కాంగ్రెస్

Parishad Election 2019 : అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల లాగానే పరిషత్ ఎన్నికల్లో కూడా కచ్చితంగా గెలుస్తామనే ధీమాలో ఉంది టీఆర్ఎస్.

Krishna Kumar N | news18-telugu
Updated: May 4, 2019, 11:14 AM IST
పరిషత్ పోరులో గెలుపెవరిది... హోరాహోరీగా తలపడుతున్న టీఆర్ఎస్, కాంగ్రెస్
ఉత్తమ్ కుమార్, కేసీఆర్
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది అన్న అంశం దేశం మొత్తాన్నీ ఆకర్షిస్తుంటే... తెలంగాణలో ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటవ్వడంతో... ఇప్పుడక్కడ పరిషత్ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్... పరిషత్ ఎన్నికల్లోనైనా కచ్చితంగా గెలవాలని అనుకుంటోంది. బలమైన అభ్యర్థులను బరిలో దింపుతోంది. ఈ పరిస్థితుల్లో ఏ పార్టీ అభ్యర్థులకి విజయం దక్కుతుందన్నదానిపై స్పష్టత రావట్లేదు. గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. తొలి దశలో MPTC, ZPTC స్థానాలకు ఈ నెల 6న ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకు సంబంధించి పార్టీలు ఇప్పటికే భారీగా ప్రచారం చేశాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు శక్తి మేరకు ప్రయత్నించాయి.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి... ఏకగ్రీవాలు కలిసొచ్చాయి. పరిషత్ ఎన్నికల్లో మాత్రం పోటీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వేర్వేరు పార్టీల నుంచీ యువ అభ్యర్థులు చాలా మంది బరిలో ఉన్నారు. అందువల్ల పార్టీలన్నీ తాడో పేడో తేల్చుకుంటామంటున్నాయి. తొలివిడత పరిషత్ ఎన్నికల్లో 2 ZPTC, 69 MPTC స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఒక్కో జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం అయ్యాయి. అవి టీఆర్ఎస్‌కి దక్కాయి. ఏకగ్రీవం అయిన 69 MPTC స్థానాల్లో 67 టీఆర్ఎస్‌కి దక్కగా... 2 కాంగ్రెస్‌కి దక్కాయి.


తొలివిడతలో 2,166 MPTC స్థానాలకు నోటిఫికేషన్ జారీ చెయ్యగా... 69 ఏకగ్రీవం కావడం వల్ల... మిగతా 2,097 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగబోతోంది. 197 ZPTC స్థానాల్లో రెండు ఏకగ్రీవం కావడం వల్ల... మిగతా 195 స్థానాలకూ 6న పోలింగ్ జరగబోతోంది.

క్షేత్రస్థాయిలో అధికారం తమ చేతుల్లో ఉంటే, ప్రభుత్వ కార్యక్రమాలు సాఫీగా సాగుతాయని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. రాష్ట్రంలో 32 ZP స్థానాలను సొంతం చేసుకోవాలని శ్రేణులకు ఇప్పటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశనిర్దేశం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ సైతం... పరిషత్ ఎన్నికలపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు సూచనలు చేశారు. ఈ క్రమంలో పరిషత్ పోరు ఎవరికి కలిసొస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.

 

ఇవి కూడా చదవండి :

గేమ్స్ ఆడుతుంటే పేలిన సెల్‌ఫోన్... ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం

కేబినెట్ కూర్పుపై జగన్ దృష్టి... తూర్పు గోదావరి జిల్లా నేతకు అత్యంత కీలక మంత్రి పదవి ?

ఏపీలో రాజకీయ సంక్షోభం... టార్గెట్ చంద్రబాబు ? రాష్ట్రపతి పాలన తెస్తారా ?

మరింత పెరగబోతున్న ఎండల వేడి... ఫొణి తుఫాను ప్రభావమే...
First published: May 4, 2019, 10:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading