హోమ్ /వార్తలు /తెలంగాణ /

Huzurabad By elections : ముగిసిన నామినేషన్ల పర్వం మొత్తం నామినేషన్లు.. ఎన్నంటే...

Huzurabad By elections : ముగిసిన నామినేషన్ల పర్వం మొత్తం నామినేషన్లు.. ఎన్నంటే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Huzurabad By elections : నామినేషన్ల పర్వం ముగిసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలతో కలిపి 26 నామినేషన్లు ధాఖలు అయినట్టు అధికారులు ప్రకటించారు.కాగా ఉపసంహరణకు మరో ఐదు రోజులు ఉండడంతో ఎంతమంది బరిలో మిగులుతారో చూడాలి..

ఇంకా చదవండి ...

  హుజూరాబాద్ ఉప ఎన్నికల పర్వంలో అతి తక్కువ నామినేషన్లు మాత్రమే ఫైల్ అయ్యాయి... పెద్ద మొత్తంలో నిరుద్యోగులు నామినేషన్లు వేస్తారని భావించినా.. పెద్దగా నామినేషన్లు మాత్రం పడలేదు.. దీంతో మొత్తంగా 26 అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేసనట్టు సమాచారం.  దీంతో ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పొటి కొనసాగనుంది. నామినేషన్లలో భాగంగా టీఆర్ఎస్ నుండి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుండి ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నుండి బల్మూరీ వెంకటనర్సింగ రావుతో పాటు పలువురు స్వతంత్ర్య అభ్యర్థులుగా నామినేషన్‌ ధాఖలు చేశారు. నామినేషన్లు పర్వం ముగియడంతో ఈనెల 11న స్క్రూటిని జరగనుండగా.. 13న ఉపసంహరణ  గడువు ముగియనుంది.

  మొత్తం మీద హుజూరాబాద్‌లో పెద్ద ఎత్తున నామినేషన్లు ఫైల్ అవుతాయని భావించినా ఉహించినంతగా అభ్యర్థులు రాలేదు. అయితే ఉపాధి హామి ఫీల్డ్ అసిస్టెంట్స్ నామినేషన్స్ వేసేందుకు ముందుకు వచ్చినా కోవిడ్ నిబంధనలతో వారిని తిరిగి వెనక్కి పంపారంటూ ఆందోళన సైతం చేశారు. దీంతో నిరుద్యోగ యువత కాని, ఇతరులు కాని వెనుదిరిగిన పరిస్థితి కినిపించింది. ఇక మొత్తం నామినేషన్‌లలో స్క్రూటిని తోపాటు.. ఉప సంహరణ తేదీ ముగిసిన నాటికి  ప్రధాన పార్టీల మధ్యే పోటి ఉండనుంది.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Huzurabad, Huzurabad By-election 2021, Nominations, Telangana

  ఉత్తమ కథలు