Home /News /telangana /

TOP MAOIST LEADER MUPPALA LAKSHMANA RAO ALIAS GANAPATHI LIKELY TO SURRENDER POLICE SOURCES BA

Maoist Ganapthi: లొంగిపోనున్న మావోయిస్టు అగ్రనేత గణపతి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Maoist Top Leader Ganaptthi | 74 సంవత్సరాల గణపతి సీపీఐ మావోయిస్టు పార్టీకి అగ్రనేతగా కొనసాగారు. కొన్ని రోజుల క్రితం ఆయన స్థానంలో బసవరాజు పగ్గాలు అప్పగించారు.

    Maoist Leader Ganapathi Surrender | మావోయిస్టు అగ్రనేత, సీపీఐ - మావోయిస్టు పార్టీ‌కి నాయకత్వం వహించిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పోలీసులకు లొంగిపోనున్నట్టు సమాచారం. ఆయన త్వరలో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోతున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గణపతి లొంగిపోవడానికి సిద్ధమైనట్టు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లోని పోలీసులు న్యూస్‌18కి ధ్రువీకరించారు. ‘ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఆగస్టు 28 లేదా 29న గణపతి ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అడవుల నుంచి బయటకు వచ్చారు. ఆయన దంతెవాడ - నారాయణపూర్ బోర్డర్ నుంచి గడ్చిరోలి గుండా తెలంగాణలోకి వెళ్తున్నారు. ఆయన త్వరలో పోలీసులకు లొంగిపోతారు.’ అని ఓ పోలీస్ అధికారి న్యూస్‌18కి తెలిపారు.

    74 సంవత్సరాల గణపతి సీపీఐ మావోయిస్టు పార్టీకి అగ్రనేతగా కొనసాగారు. కొన్ని రోజుల క్రితం ఆయన స్థానంలో బసవరాజు పగ్గాలు అప్పగించారు. నాయకత్వ మార్పు మీద గణపతి అసంతృప్తితో ఉన్నారని, అలాగే, వయసు రీత్యా అనారోగ్య కారణాల దృష్ట్యా గణపతి లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 2004 సంవత్సరంలో CPI-ML-PWG, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్లు సీపీఐ - మావోయిస్టు పార్టీలో విలీనం కావడంలో గణపతి కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత అవి ఫలప్రదం కాలేదు. కానీ, ఆ తర్వాత మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి.

    ‘ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో కూడా కరోనా ప్రభావం బాగా ఉంది. ఆధార్ కార్డు లేకపోతే కరోనా టెస్టులు చేయరు. శాంపిల్స్ కూడా తీసుకోరు. అడవుల్లో అలాంటి టెస్టులు జరగవు. దీంతోపాటు పార్టీలో కొందరు సీనియర్ లీడర్లు జనబాహుళ్యంలో తిరిగే నేతలతో కూడా అప్పుడప్పుడు చర్చలు జరుపుతూ ఉంటారు. అలాంటి సమయంలో వారికి వైరస్ సోకే అవకాశం కూడా ఉండొచ్చు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరగడం వల్లే లొంగిపోవాలనుకుంటూ ఉండొచ్చు.’ అని ఓ అధికారి చెప్పారు. అయితే, గణపతికి కరోనా వచ్చి ఉంటుందని కచ్చితంగా ధ్రువీకరించలేదు.

    మావోయిస్టు పార్టీకి నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత కూడా గణపతి సెంట్రల్ కమిటీ సభ్యుడి కొనసాగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దగ్గరగా ఉండే, ఓ టీఆర్ఎస్ పార్టీ నేత ద్వారా గణపతి పోలీసుల ఎదుట లొంగిపోవడానికి రాయబారం పంపారని తెలిసింది. గణపతి తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన వారు. ఆయనతో పాటు మరికొందరు కూడా లొంగిపోతారని సమాచారం. పీపుల్స్ వార్ గ్రూప్ వ్యవస్థాపకులు కొండపల్లి సీతారామయ్య అనుచరుల్లో గణపతి కూడా ముఖ్యుడు.

    మరోవైపు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆసిఫాబాద్‌‌లో పర్యటించారు. హెలికాప్టర్‌లో ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు పోలీస్ బాస్ చేరుకున్నారు. 45 రోజుల వ్యవధిలో రెండో సారి కొమురం భీం ఆసిఫాబాద్‌లో డీజీపీ పర్యటన కొనసాగుతోంది. మావోయిస్టు  అగ్రనేతల లొంగుబాటు వార్తల నేపథ్యంలో డీజీపీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో జూలై 17న డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లాలో పర్యటించి వెళ్లిన విషయం తెలిసిందే.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Maoists, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు