పెళ్లిచూపులు ముందు కరోనా వచ్చుంటే... విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

తాను ఇంటికి వెళ్లగానే ఇంట్లో ఎన్నో కండీషన్స్ ఉంటాయని... నేరుగా బాత్ రూమ్‌కు వెళ్లి ఫ్రెష్ అయిన తరువాతే మిగతా పనులు చేసుకోవడానికి వీలుంటుందని విజయ్ దేవరకొండ తెలిపారు.

news18-telugu
Updated: April 16, 2020, 8:06 PM IST
పెళ్లిచూపులు ముందు కరోనా వచ్చుంటే... విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
9 మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నాడు. దక్షిణాదిలో ఇన్‌స్టాలో 9 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ఏకైక హీరోగా విజయ్ దేవరకొండ కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డు ఇది. దాంతో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.
  • Share this:
పెళ్లిచూపులు సినిమా ముందు కరోనా వైరస్ వచ్చి పరిస్థితులు ఈరకంగా ఉండి ఉంటే తమ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికి కూడా తన భయమేస్తోందని టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ అన్నారు. తమ ఫ్యామిలీలో ఎవరూ గవర్న్‌మెంట్ ఎంప్లాయిస్ లేరని... ఎవరూ వెల్ సెటిల్ కాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమని విజయ్ దేవరకొండ చెప్పారు. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు సిబ్బందిని కలుసుకున్న విజయ్ దేవరకొండ... వారికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. వారికి ప్రజలంతా సహకరించాలని సూచించారు. తాను ఇంటికి వెళ్లగానే ఇంట్లో ఎన్నో కండీషన్స్ ఉంటాయని... నేరుగా బాత్ రూమ్‌కు వెళ్లి ఫ్రెష్ అయిన తరువాతే మిగతా పనులు చేసుకోవడానికి వీలుంటుందని ఈ యంగ్ హీరో తెలిపారు. ఈ విషయంతో తన తల్లి చాలా కచ్చితంగా ఉంటారని అన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా... మళ్లీ అంతా మొదటికి వస్తుందని విజయ్ దేవరకొండ ఆందోళన వ్యక్తం చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: April 16, 2020, 8:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading