టాలీవుడ్ కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) మరోసారి వార్తల్లో నిలిచారు. తాను జోకర్ కాదు ఫైటర్ని అని ఇటీవల ఎమ్మెల్సీ కవిత (Kavith)కు కౌంటర్ ఇచ్చిన ఆయన.. తాజాగా ప్రకాష్ రాజ్(Prakash Raj)ను టార్గెట్ చేసుకున్నారు. జీచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ (Pawan kalyan) బీజేపీకి మద్దతు తెలపడాన్ని విమర్శిస్తూ.. ఆయన్ను ఊసరవెల్లిగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ తనకు దేవుడి లాంటోడని.. ఆయన వ్యక్తిత్వం గురించి ఎవరు మాట్లాడినా సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్లో వరుస ట్వీట్లతో పవన్‌పై మరోసారి అభిమానాన్ని చాటుకున్నారు బండ్ల గణేష్.
'' నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం ఆయన వ్యక్తిత్వం ఆయన నిజాయితీ ఆయన నిబద్ధత నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తి రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు రాజకీయాలు ఎవరైనా మాట్లాడుకోవచ్చు కాని వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను పవన్ కళ్యాణ్ నా దృష్టిలో నాకు ఎప్పటికీ దైవంతో సమానం. ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఎంతో మంది సాంకేతిక నిపుణులు ఎంతోమంది నిర్మాతల్ని పరిచయం చేసిన ఘనత మా దైవం పవన్ కళ్యాణ్''. అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.
పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తి రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు రాజకీయాలు ఎవరైనా మాట్లాడుకోవచ్చు కాని వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను పవన్ కళ్యాణ్ నా దృష్టిలో నాకు ఎప్పటికీ దైవంతో సమానం@PawanKalyan @prakashraaj 🙏
— BANDLA GANESH. (@ganeshbandla) December 1, 2020
ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఎంతో మంది సాంకేతిక నిపుణులు ఎంతోమంది నిర్మాతల్ని పరిచయం చేసిన ఘనత మా దైవం పవన్ కళ్యాణ్ @PawanKalyan @prakashraaj
— BANDLA GANESH. (@ganeshbandla) December 1, 2020
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరిని ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. మీరు ఒక పార్టీకి అధినేత అయి ఉండి.. వేరొక పార్టీని ఎందుకు భుజాలపై ఎత్తుకుంటున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ నిర్ణయం ఆ పార్టీ కార్యకర్తలతో పాటు తననూ నిరుత్సాహానికి గురి చేసిందన్నారు ప్రకాష్ రాజ్.
''పవన్ కల్యాణ్కుఏమైందో నాకు నిజంగా అర్ధం కావండం లేదు. ఆయన నిర్ణయం పట్ల నిరుత్సాహానికి గురయ్యా. మీరు నాయకుడు. జనసేన పార్టీ ఉంది. మీరు ఇంకో నాయకుడికి మద్దతు ఎందుు తెలుపుతున్నారు? మీ ఓట్ షేర్ ఏంటి? బీజేపీ ఓట్ షేర్ ఏంటి..? మీరు ఆయన భుజాలెక్కడం ఏంటి? 2014లో ఇంద్రుడు చంద్రుడు అని మీరే మద్దతు తెలిపారు. వారు ద్రోహం చేశారని గత ఎన్నికల్లో అన్నారు. మళ్లీ ఇప్పుడు మీకు నాయకుడిగా కనిపిస్తున్నారు. మీరు ఇన్ని సార్లు మారుతున్నారంటే ఊసరవెల్లి అయి ఉండాలి.'' అని ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఆయన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఘాటుగానే స్పందించారు. నువ్వో కుసంస్కారివి అంటూ విరుచుకుపడ్డారు. నాగబాబు విమర్శలపై ప్రకాష్ రాజ్ కూడా రివర్స్ కౌంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలుగు రాజకీయాలతో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, Pawan kalyan, Prakash Raj, Tollywood