Vijay Devarkonda on Covid -19| ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ అందరినీ భయ భ్రాంతలలకు గురి చేస్తోంది. గత 15 రోజుల్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలు సరైన వైద్య సదుపాయాలు లేక ప్రాణాలు విడుస్తున్నారు. ఈ సందర్భంగా సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కరోనా నుంచి కోలుకున్నారు. ఇపుడిపుడే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కోవిడ్ పై అవగాహన కల్పించడానికి హీరో విజయ్ దేవరకొండ సాయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరికైనా కోవిడ్ లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే.. తెలంగాణలో పల్లెల్లో పట్టణాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలతో పాటు ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల్లో ప్రత్యేకంగా కోవిడ్ ఔట్ పేషెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇక పైన చెప్పిన వాటిలో ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే.. వెంటనే అక్కడ డాక్టర్లను సంప్రదించి మందులు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా కోవిడ్ టెస్ట్ చేయించుకొని రిజల్డ్ వచ్చే వరకు ఎంతో టైమ్ పడుతోంది. దీని వల్ల పేషెంట్‌కు ఎంతో నష్టం జరుగుతోంది. సీరియస్ అవుతోంది. అందుకే కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు కనిపించగానే.. వెంటనే ఆయా హాస్పిటల్లో డాక్టర్ల సలహా మేరకు తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ మందుల కిట్ ఏర్పాటు చేసినట్టు చెప్పుకొచ్చారు.
Hero @TheDeverakonda talks about precautions to take if you have #COVID19 symptoms.
Stay Strong, Stay Safe.! pic.twitter.com/y8TJY6Houd
— BARaju (@baraju_SuperHit) May 7, 2021
డాక్టర్ల సలహా మేరకు మందులు వేసుకోవాలని సూచించారు. ఈ ట్రీట్మెంట్ జరిగే వరకు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని సూచించారు. దీంతో కరోనా ఉన్న పేషెంట్స్ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Covid-19, Telangana, Telugu Cinema, Tollywood, Vijay Devarakonda