ఎవ్వరినీ వదలం...టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సిట్ ట్విస్ట్

బ2018 జూన్‌ 13న ఇచ్చిన సమాచారమని అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌, ప్రస్తుతం పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా ఉన్న అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. అదనపు చార్జిషీట్లు వేయాల్సి ఉందని చెప్పుకొచ్చారు.

news18-telugu
Updated: May 15, 2019, 2:17 PM IST
ఎవ్వరినీ వదలం...టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సిట్ ట్విస్ట్
టాలీవుడ్ సెలబ్రిటీలు
  • Share this:
తెలుగు సినీఇండస్ట్రీలో సంచలనంరేపిన డ్రగ్స్ కేసులో సిట్ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఈ కేసులో ఎవ్వరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని స్పష్టంచేసింది. డ్రగ్స్ కేసుతో సంబంధమున్న ఏ ఒక్కరినీ వదలిపెట్టమని..పుకార్లను నమ్మవద్దని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు 7 చార్జ్‌షీట్లు దాఖలు చేశామని.. మరో ఐదు దాఖలు చేయాల్సి ఉందని తెలిపారు. సినీతారల వ్యవహారంలో ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చాయన్న అధికారులు..త్వరలోనే మిగతా చార్జిషీట్లను దాఖలు చేస్తామని స్పష్టంచేశారు.

డ్రగ్స్ కేసులో సినీ నటులకు క్లీన్‌చిట్ వచ్చిందంటూ మంగళవారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఐతే ఆ ప్రచారంలో వాస్తవం లేదని అధికారులు వెల్లడించారు.


కాగా, 2017లో టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు రేపింది. డ్రగ్స్ సరఫరాదారు అలెక్స్‌ను పోలీసులు పట్టుకోవడంతో సినీ తారల పేర్లు బయటకొచ్చాయి. ఈ కేసుపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిట్ నియమించి విచారణ చేపట్టారు. ర‌వితేజ‌, ఛార్మీ, పూరి జ‌గ‌న్నాధ్‌, న‌వ‌దీప్, త‌రుణ్‌, త‌నీష్‌, సుబ్బ‌రాజు, ముమైత్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలను విచారించి..వారి నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించారు. మొత్తం 12 కేసులు నమోదుచేసిన పోలీసులు ఇప్పటి వరకు 7 చార్జిషీట్లు దాఖలు చేశారు.

ఐతే చార్జిషీట్లలో సినీ నటుల పేర్లు లేవని ప్రచారం జరగడంతో అధికారులు స్పందించారు. మీడియాలో వస్తున్న సమాచారం ఇప్పటిది కాదని, 2018 జూన్‌ 13న ఇచ్చిన సమాచారమని అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌, ప్రస్తుతం పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా ఉన్న అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. అదనపు చార్జిషీట్లు వేయాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఈ కేసుతో సంబంధమున్న ఏ ఒక్కరినీ వదలిపెట్టబోమని ఎక్సైజ్ శాఖ స్పష్టంచేసింది.
First published: May 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు