హోమ్ /వార్తలు /తెలంగాణ /

తెలంగాణలో ఒక్క రూపాయికే లిక్కర్.. దర్శకుడి పెళ్లి రోజున బంపర్ ఆఫర్

తెలంగాణలో ఒక్క రూపాయికే లిక్కర్.. దర్శకుడి పెళ్లి రోజున బంపర్ ఆఫర్

మద్యం (ఫైల్ ఫొటో)

మద్యం (ఫైల్ ఫొటో)

దర్శకుడి పెళ్లి రోజును పురస్కరించుకొని అలంపూర్‌లో ఒక్కరూపాయికే మద్యం పంపిణీ చేశారు. ఆదివారం రాత్రి గంట పాటు ఎస్వీ వైన్ షాపు ముందు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.

కరోనా లాక్‌డౌన్‌ తర్వాత తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెరిగాయి. ఐనా ప్రభుత్వాన్ని తిట్టుకుంటూనే లిక్కర్ కిక్కులో తూలుతున్నారు మందు బాబులు. అధిక ధరల వల్ల బ్రాండ్ మార్చారు తప్ప ..బాటిల్‌ను పక్కనబెట్టలేదు. కానీ సడె‌గా ఒక్క రూపాయికే మద్యం పంపిణీ చేస్తే.. ఇంకేమైనా.. ఉందా..? లిక్కర్ షాపు ముందు వాలిపోతారు. ఎంత కష్టమైనా క్యూలో నిలబడి బాటిల్‌ను సాధించుకొస్తారు. ఈ సీన్ నిజంగానే జరిగింది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఆదివారం ఒక్క రూపాయికే క్వార్టర్ బాటిల్‌కు విక్రయించారు. ఇదేంటి..? వందలు తగలేస్తే గానీ రాని క్వార్టర్ బాటిల్‌ను ఒక్క రూపాయికే ఎందుకు అమ్మారనేగా.. మీ ప్రశ్న..? దీని వెనక పెద్ద కథే ఉంది. అంతకు మించిన అభిమానం ఉంది.


రాజకీయ నాయకులు, సినీ తారల పుట్టిన రోజుల నాడు అభిమానుల సందడి మామూలుగా ఉండదు. ఫ్లెక్సీలు.. కేక్ కటింగ్‌లు.. అన్నదానాలు.. రక్త దానాలంటూ రచ్చ రచ్చ చేస్తారు. నానా హంగామా చేస్తారు. కానీ గద్వాల జిల్లాకు చెందిన ఓ అభిమాని మాత్రం ఏకంగా మద్యం పంపిణీ చేశాడు. ఒక్క రూపాయికే క్వార్టర్ లిక్కర్ ఇచ్చి మందుబాబుల దాహం తీర్చే ప్రయత్నం చేశాడు.

చింతకుంట విష్ణు అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈయనకు టాలీవుడ్ దర్శకుడు ఎన్. శంకర్ అంటే ఎంతో అభిమానం. ఒకరంగా చెప్పాలంటే పిచ్చి. ఇవాళ శంకర్ పెళ్లి రోజు కావడంతో.. ఆయన వెడ్డింగ్ యానివర్సరీని విష్ణు ఘనంగా జరుపుకున్నారు. దర్శకుడి పెళ్లి రోజును పురస్కరించుకొని అలంపూర్‌లో ఒక్క రూపాయికే మద్యం పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం గంట పాటు ఎస్వీ వైన్ షాపు ముందు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.

రూపాయికే క్వార్టర్ ఇస్తున్న వార్త క్షణాల్లోనే అందరికీ తెలిసిపోయింది. చాలా మంది మందుబాబులు అక్కడకు పరుగు పరుగున చేరుకున్నారు. ఐతే కేవలం గంట పాటే పంపిణీ చేయడంతో చాలా తక్కువ మందిని మాత్రం అదృష్టం వరించింది. జనాలు ఎగబడతారని తెలిసి.. ముందుగానే టోకెన్‌లు పంచారు. అనంతరం టోకెన్‌లు చూపించి.. భౌతిక దూరం పాటిస్తూ.. క్వార్టర్ లిక్కర్ బాటిల్‌ను పట్టుకెళ్లారు మందుబాబులు. ఇలా 60 మందికి ఆఫీసర్‌ చాయిస్‌ క్వాటర్‌ మద్యం బాటిళ్లు పంపిణీ చేశారు విష్ణు. వీటి విలువ రూ.8,340. అనంతరం మరో 200 మందికి అన్నదానం కూడా చేశారు.

ఈ వన్ రూపీ లిక్కర్ దెబ్బకు విష్ణు పేరు వార్తల్లో మార్మోగిపోతోంది. ఐతే ప్రచారం కోసం ఇదంతా చేయలేదని విష్ణు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో శంకర్‌తో తనకు పరిచయం ఏర్పడిందని, ఆయనపై అభిమానంతో వినూత్న కార్యక్రమం చేపట్టామని చెప్పారు.

First published:

Tags: Gadwal, Liquor sales, Telangana, Wine shops

ఉత్తమ కథలు