తెలుగునాట ఏ నోట విన్నా ఇప్పుడు మారుతీరావు, అమృత వర్షిణి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ తండ్రీ కూతుళ్ల గురించి తమకు తోచినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు అమృతపై జాలి చూపిస్తుంటే.. మరికొందరు మారుతీరావుకు మద్దతు తెలుపుతున్నారు. వీరిద్దరికి సంబంధించిన వార్తలు వస్తే చాలు.. సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అయితే, అమృత గురించి శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఫేస్బుక్ వేదికగా ‘నిన్ను చూసి సిగ్గుగా ఉంది’ అంటూ కామెంట్ చేసింది. ఆమె పోస్ట్‌పై విమర్శలు రావడంతో వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసి, తన తప్పును సరిదిద్దుకునేలా మరో పోస్ట్ చేసింది. ‘అమృత.. నీ బాధను అర్థం చేసుకున్నా. రియలైజ్ అయ్యా. క్షమించు. నువ్వు చాలా పోగొట్టుకున్నావు. దేవుడు నిన్ను, నీ బిడ్డను దీవించాలి’ అని కామెంట్ చేసింది.
చాలా సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ శ్రీరెడ్డి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరువిప్పి బాంబ్ పేల్చిన ఈమె.. ఇప్పుడు సామాజిక అంశాలపైనా స్పందిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.