హోమ్ /వార్తలు /telangana /

Toll Plazas: డబ్బే డబ్బు.. టోల్ ప్లాజాల పంట పండించిన సంక్రాంతి సీజన్.. ఈసారి కలెక్షన్ ఎంతంటే?

Toll Plazas: డబ్బే డబ్బు.. టోల్ ప్లాజాల పంట పండించిన సంక్రాంతి సీజన్.. ఈసారి కలెక్షన్ ఎంతంటే?

Toll plazas: మూడు రోజుల పండుగ సందర్భంగా టోల్ ప్లాజాలు 7.55 లక్షల లావాదేవీలు నిర్వహించగా.. గత ఏడాది ఇది 6.26 లక్షల లావాదేవీలు జరిగాయి. మరి ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా..?

Toll plazas: మూడు రోజుల పండుగ సందర్భంగా టోల్ ప్లాజాలు 7.55 లక్షల లావాదేవీలు నిర్వహించగా.. గత ఏడాది ఇది 6.26 లక్షల లావాదేవీలు జరిగాయి. మరి ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా..?

Toll plazas: మూడు రోజుల పండుగ సందర్భంగా టోల్ ప్లాజాలు 7.55 లక్షల లావాదేవీలు నిర్వహించగా.. గత ఏడాది ఇది 6.26 లక్షల లావాదేవీలు జరిగాయి. మరి ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా..?

    ప్ర‌తి ఏడాది సంక్రాంతి (Sankranti) స‌మ‌యంలో హైద‌రాబాద్ (Hyderabad) నుంచి వివిధ ప్రాంతాల‌కు వెళ్లేవాళ్ల సంఖ్య గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. పండ‌గ ఇంకా రెండు మూడు రోజులు నుంచే హైదరాబాద్ నగరం ఖాళీ అవుతుంది. జనమంతా పల్లెటూర్ల బాటపడతారు. హైద‌రాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు హైవే కార్లతో కిక్కిరిసి పోయే దృశ్యాలు మ‌నం ఏటా చూస్తూ ఉంటాం. అయితే ఈ ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అయింది. తద్వారా రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాల (Toll Plazas)లో  భారీ రద్దీ నెలకొంది. పండుగను జరుపుకోవడానికి వేలాది మంది ఆర్టీసీ బస్సులతో పాటు త‌మ సొంత వాహానాల్లో సొంతూర్ల బాట‌ప‌ట్టారు. ఆ వాహనాలతో టోల్ గేట్లు కిటకిటలాడాయి. ముఖ్యంగా  ఆంధ్రప్రదేశ్,  కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వెళ్లే జాతీయ రహదారుల టోల్స్ అన్ని ర‌ద్దీగా  మారాయి. ఫ‌లితంగా గ‌త ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పండ‌గ సమ‌యంలో టోల్ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది.

    Vanajeevi Ramaiah : హరిత నిధికి వనజీవి రామయ్య విరాళం.. 20 టన్నుల ఎర్రచందనం బహుమానం..

    పండగకు ముందు హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్లడం.. పండగ ముగిసిన తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు రావడంతో.. ఆ నాలుగైదు రోజులు టోల్ ప్లాజాలకు భారీగా ఆదాయం వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల‌తోపాటు ప‌క్క రాష్ట్రాలైన క‌ర్ణాట‌క, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ మ‌ధ్య టోల్ లావాదేవీలు గ‌తంలో ఎన్నాడు లేని విధంగా పెరిగాయి.  గ‌డిచిన ఏడాదితో పోలిస్తే ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగడంతో టోల్ ప్లాజాల ఆదాయం పెరిగింది. మూడు రోజుల పండుగ సందర్భంగా టోల్ ప్లాజాలు 7.55 లక్షల లావాదేవీలు నిర్వహించగా.. గత ఏడాది ఇది 6.26 లక్షల లావాదేవీలు జరిగాయి. అన్ని జాతీయ రహదారుల్లో హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై ఉన్న టోల్‌ ప్లాజాల్లో 3.78 లక్షల లావాదేవీలు జరిగాయి. టోల్ ప్లాజాల ద్వారా ఈసారి మొత్తం రూ.11.72 కోట్ల ఆదాయం సమకూరగా, 2021లో రూ.9.49 కోట్లు వ‌చ్చిన‌ట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి.

    Nizamabad : యువతులారా జాగ్రత్త.. తన ఇంటిముందే భర్త కావాలంటూ ధర్నా చేపట్టింది.. ఎందుకంటే..

    ఇక ఈ ఏడాది ఫాస్టాగ్‌ (Fastag) వినియోగించే వారి సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింద‌ని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది పండ‌గ సమ‌యంలో ఫాస్టాగ్ వినియోగించిన వారి సంఖ్య‌ 97.36 శాతానికి పెరిగింది. గతేడాది ఫాస్టాగ్ వినియోగం రూ.81.36 శాతం మాత్రమే ఉంది.

    IRCTC Tirupati Tour: తిరుమలలో శ్రీవారి దర్శనంతో తిరుపతి టూర్... ప్యాకేజీ ధర

    ఇదిలా ఉంటే పండ‌గ స‌మ‌యంలో టీఎస్ ఆర్టీసీ (TSRTC)కి కూడా గ‌ట్టి లాభాలే వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది  పండుగ సందర్భంగా అదనంగా  4,000 బస్సులను ఏర్పాటు చేయడం ద్వారా టిఎస్‌ఆర్‌టిసికి రూ.107 కోట్ల ఆదాయం సమకూరింది. స్పెషల్ బస్సుకు అదనపు చార్జీలు వసూలు చేయకుండా.. సాధారణ చార్జీలనే వసూలు చేయడం కలిసొచ్చింది. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకే మొగ్గుచూపారు. ఈ పండ‌గ సమ‌యంలో దాదాపు 55 లక్షల మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు తరలించింది. టిఎస్‌ఆర్‌టిసి జనవరి 7 నుండి 14 వరకు అదనపు బస్సులు న‌డ‌ప‌డం ద్వారా ఈ ఆదాయాన్ని స‌మ‌కూర్చిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

    First published:

    ఉత్తమ కథలు