• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TODDY WILL KILL CORONA TELANGANA VILLAGE PEOPLE BLIND BELIEF VB KNR

Toddy Corona : తాటికల్లుతో కరోనా ఖతం..! ఆ ప్రాంతంలో విపరీతమైన డిమాండ్.. ఫోన్ చేసి మరీ ఆర్డర్..

Toddy Corona : తాటికల్లుతో కరోనా ఖతం..! ఆ ప్రాంతంలో విపరీతమైన డిమాండ్.. ఫోన్ చేసి మరీ ఆర్డర్..

తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తున్న గీత కార్మికుడు

Toddy Corona : తాటి కల్లు తాగితే కరోనా పోతుందా.. ఏ మందులకు లొంగని మహమ్మారి కల్లుకు లొంగుతుందా.. అవును నిజమేనంటున్నారు ఆ ఊరి ప్రజలు . తాటి కల్లు తాగితే కరొనా రాదని , గట్టిగా నమ్ముతున్నారు. అలవాటు లేనివారు కూడా తాటి కల్లు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు .

  • Share this:
    (పి. శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా, న్యూస్ 18 తెలుగు)

    తాటికల్లుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. అయితే అప్పుడే తీసిన కల్లునే తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తాటిచెట్టు ప్రసాదించే కల్లు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తాటికల్లులో ఖనిజ లవణాలు, విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. అయితే జంక్ ఫుడ్స్‌ తిని ఆహారపు అలవాట్లతో అస్తవ్యస్తమైన మానవ జీర్ణ వ్యవస్థను ఈ తాటికల్లు బాగుచేస్తుంది. శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయాన్నే పరగడుపున స్వచ్ఛమైన తాటికల్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని మన పూర్వికులు కూడా చెప్పారు. ప్రస్తుతం ఇది నిజమని పరిశోధనల్లో కూడా తేలిపోయింది. ఉదయాన్నే పరిగడుపున స్వచ్ఛమైన తాటికల్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని మన పూర్వికులు కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం కరోనా వ్యాపిస్తున్న వేళ తాటి కల్లు తాగితే కరోనా రాదని గ్రామాల ప్రజలు నమ్ముతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో తాటి కల్లు తాగితే కరోనా రాదని , తాటికల్లులో వైరస్ కారకాలను చంపేసే ఆయుర్వేద గుణం ఉందని , అందుకే తాటి కల్లు తాగిన వారికి కరోనా రావడం లేదని స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు .

    తాటి కల్లు తాగితే కరోనా రాదన్న విషయాన్ని సైంటిస్టులు పత్రికల్లో చెప్పారని అంటున్నారు . తాటి కల్లు ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ లా పనిచేసే ఔషధ గుణాలున్న దివ్య ఔషధం అని , తాటి కల్లు తాగితే శరీరానికి కూడా ఎంతో మంచిదని వైద్యాధికారులు, ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు. గీత కార్మికులకు ఫోన్ చేసి మరీ కల్లును ముందే బుక్చే సుకుంటున్నారు స్థానికులు. తాటి కల్లుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఒకరోజు ముందుగానే బుక్ చేసుకుంటున్నారు . లేదంటే కల్లు దొరకడం లేదని చెబుతున్నారు. కల్లు తాగిన వారికి ఈ ఊరిలో ఎవరికీ కరోనా వైరస్ సోకడం లేదని కూడా స్థానికులు చెప్తున్నారు.. ఏది ఏమైనా తాటి కల్లు తాగితే కరోనా పోతుందో , లేదో తెలియదు కానీ తాటి కల్లు తాగితే కరోనా రాదని ఈ ప్రాంత ప్రజలు బలంగా నమ్ముతున్నారు .

    తాటికల్లు కుండలు


    స్థానికుల నమ్మకం ఎలా ఉన్నా గీత కార్మికులకు మాత్రం బాగా గిరాకీ అవుతుందంటున్నారు. గీత కార్మికులు కూడా భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్, వాడుతూ కల్లు పోస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా లో చాలా వైరల్ అవుతుంది.
    Published by:Veera Babu
    First published: