వైసీపీ ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే పరిమితమైంది. టీడీపీ కూడా దాదాపు ఏపీతోనే సర్దుకుపోతోంది. జనసేన మాత్రం రెండు చోట్లా సత్తా చాటుతామని ప్రకటించింది. ప్రస్తుతానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి సారిస్తున్న ఆపార్టీ... ఇవాళ తెలంగాణ గడ్డపై ఎన్నికల ప్రచారం చెయ్యబోతోంది. ఇందుకు ఎల్బీ స్టేడియంను వేదికగా ఎంచుకుంది. సాయంత్రం 4 గంటల నుంచీ 7.30 గంటల వరకూ జనసేన బహిరంగ సభ జరగబోతోంది. ఈ వేదికపై పవన్ కల్యాణ్‌తో పాటూ... జనసేనతో పొత్తు పెట్టుకున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి కూడా హాజరై, ప్రసంగించబోతున్నారు. ఐతే... ఈ సభకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌తోపాటూ... జనసేన కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారన్న అంచనాలున్నాయి. ముందు జాగ్రత్తగా పోలీసులు... ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇవీ :
* బషీర్ బాగ్ కూడలి నుంచి వచ్చే వాహనాల్ని హైదర్‌గూడ, కింగ్ కోఠి రోడ్డు వైపు మళ్లింపు
* అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలు లిబర్టీ కూడలి నుంచి హిమాయత్ నగర్ వైపు వెళ్లాలి.
* ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్ బాగ్ వైపు వెళ్లే వాహనాలు హిమాయత్ నగర్ వై-జంక్షన్ మీదుగా వెళ్లాలి.
* అబిడ్స్, గన్ ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్ మీదుగా వెళ్లాలి.
* రాజ్ మొహల్లా వైపు నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వచ్చే వాహనాల్ని శ్మశానం కూడలి వైపు మళ్లిస్తున్నారు.
* ఏఆర్ పెట్రోల్ పంప్ కూడలి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలు నాంపల్లి వైపు వెళ్లాలి.
* ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వైపు నుంచి బషీర్ బాగ్ కూడలి వైపు వచ్చే వాహనాలు పీసీఆర్ వద్ద నాంపల్లి వైపు మళ్లింపు
ఆల్రెడీ హైదరాబాద్‌లో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్స్ ఎక్కువే. ఇక సభలు, సమావేశాలు జరిగినప్పుడు... కొత్త ఆంక్షలు పెడితే ఇంకా సమస్య. అయినప్పటికీ... ఈ నాల్రోజులు తప్పదులే అని ప్రజలు సర్దుకుపోతున్నారు.
ఇవి కూడా చదవండి :
ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగాలెందుకు... ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహం మార్చారా...
తెలంగాణలో మరో 6 ఔటర్ రింగ్ రోడ్డులు... రూ.9000 కోట్లతో నిర్మాణం.... ఎన్నికల తర్వాత మొదలు....
IPL 2019 : ముంబై ఇండియన్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అరుదైన దృశ్యాలు...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Janasena, Janasena party, Mayawa, Mayawati, Pawan kalyan