హైదరాబాద్ బేగంపేట మెట్రో స్టేషన్ ఇవాళ మూసివేశారు. ప్రతీ మెట్రో స్టేషన్‌లో కూడా దీనిపై సమాచారం అందించారు. టికెట్ బుకింగ్ సెంటర్ల వద్ద ... నోటీసులు అంటించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇవాళ బేగంపేట మెట్రో స్టేషన్ మూసివేస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. బేగం పేట మెట్రో స్టేషన్‌లో రైలు ఆగదన్నారు. దీంతో అక్కడకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. ఒకవైపు బస్సులు లేక.. మరోవైపు మెట్రో కూడా ఆ స్టేషన్‌లో ఆగకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.
అయితే ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో ప్రగతి భవన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను పెంచారు అధికారులు. భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. మరోవైపు ఇవాల్టీ నుంచి స్కూల్స్ , కాలేజీలు కూడా తెరుచుకోవడతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.