హైదరాబాద్‌లో నేడు భారీ వర్షం... అప్రమత్తంగా ఉండండి

బయట ప్రాంతాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ తెలిపారు.

news18-telugu
Updated: September 29, 2019, 12:21 PM IST
హైదరాబాద్‌లో నేడు భారీ వర్షం... అప్రమత్తంగా ఉండండి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 29, 2019, 12:21 PM IST
హైదరాబాద్‌లో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో బయట ప్రాంతాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారన్నారు. ప్రయాణాలు చేసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. అవసరమైతే తప్పా బయటకు రావద్దన్నారు సీపీ. వర్షం కారణంగా ఇబ్బందులు వస్తే డయల్ 100కు ఫోన్ చేయాలని తెలిపారు సీపీ అంజన్ కుమార్. గత వారం రోజులుగా భారీ వర్షాలు భాగ్యనగరాన్ని కుమ్మేస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం కూడా హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు, నాలాలు, కాలువలు జలమయం అయ్యాయి.

మరోవైపు ఏపీ తెలంగాణతో పాటు భారీ వర్షాలు ఉత్తరాదిని సైతం వణికిస్తున్నారు.బీహార్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. భారీ వర్షాలకు బీహార్, యూపీ అతలాకుతలం అయ్యాయి. ఇటు ఎన్టీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి.


First published: September 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...