బీజేపీ ఆఫీసులో కోదండరాం.. కీలక ప్రతిపాదన...

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. టీ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో సమావేశం అయ్యారు.

news18-telugu
Updated: October 11, 2019, 3:25 PM IST
బీజేపీ ఆఫీసులో కోదండరాం.. కీలక ప్రతిపాదన...
కోదండరామ్
news18-telugu
Updated: October 11, 2019, 3:25 PM IST
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. టీ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో సమావేశం అయ్యారు. అయితే, తన భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కోదండరాం స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన కలవడానికి బీజేపీ కార్యాలయానికి వచ్చినట్టు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని పార్టీలు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల ఉద్యమానికి రాజకీయ పార్టీల పోరాటం కూడా తోడయితే ప్రభుత్వం దిగి వస్తుందని కోదండరాం అన్నారు. కార్మికుల సమస్యల కంటే రాజకీయం ముఖ్యం కాదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తిస్థాయిలో మద్దతిస్తుందని లక్ష్మణ్ చెప్పినట్టు కోదండరాం తెలిపారు. అన్ని పార్టీలు ఆర్టీసీ జేఏసీ కింద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు పలు ఇతర డిమాండ్లతో కార్మికులు ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం వారి డిమాండ్లను పట్టించుకోలేదు. విధులకు హాజరుకాని వారు సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వారందరి స్థానంలో కొత్తగా రిక్రూట్‌మెంట్ చేస్తామని ప్రకటించారు. మరోవైపు ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.

జగన్ ముద్దు.. కేసీఆర్ వద్దంటూ ఆర్టీసీ కార్మికుల నినాదాలుFirst published: October 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...