హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: ఎంఐఎంలో ఎంత మార్పు.. నిజాంపై అసదుద్దీన్ కామెంట్స్‌కి కారణమిదేనా?

Hyderabad: ఎంఐఎంలో ఎంత మార్పు.. నిజాంపై అసదుద్దీన్ కామెంట్స్‌కి కారణమిదేనా?

Asaduddin owaisi

Asaduddin owaisi

Telangana: బీజేపీని ఆత్మ రక్షణలో పడేసే వ్యూహంలో భాగంగానే టీఆర్ఎస్, ఎంఐఎం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వేడుకలను వ్యతిరేకించినట్లయితే ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుందని.. అందువల్ల దానిని వ్యతిరేకించకుండా మరో రూపంలో వేడుకలను నిర్వహించేందుకు నిర్ణయించినట్లు సమాచారం.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  నిన్నటి వరకు మునుగోడు (Munugodu Bypoll) చుట్టూ తిరిగిన తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సడెన్‌గా సెప్టెంబరు 17 వైపు యూటర్న్ తీసుకున్నాయి. సెప్టెంబరు 17 సందర్భంగా తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలను (Telangana Liberation Day) జరపాలని కేంద్రం నిర్ణయించింది. హైదరాబాాద్‌లో జరిగిన కార్యక్రమాలకు తెలంగాణ సీఎంతో పాటు కర్నాటక, మహారాష్ట్ర సీఎంలకు కూడా ఆహ్వానాలు పంపింది. ఏడాది పాటు వేడుకలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈసారి అధికారికంగా సెప్టెంబరు 17ను జరపనుంది. విమోచన, విలీన దినోత్సవంగా కాకుండా.. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా ( Telangana National Integrity Day) నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సెప్టెంబరు 16, 17, 18న ప్రత్యేక కార్యక్రమాలను తలపెట్టింది.

  Telangana: తెలంగాణ విమోచన వేడుకలు.. మూడు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం లేఖ

  సెప్టెంబరు 17కి సంబంధించి బీజేపీ , టీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో.. మధ్యలోకి ఎంట్రీ ఇచ్చారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi). సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన రోజు అని గుర్తు చేశారు. ఆ రోజున విమోచన దినోత్సవం జరపాలని కేంద్రం నిర్ణయించిందని.. కానీ అలాకాకుండా జాతీయ సమైక్యతా దినోత్సవం జరపాలని కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమితా, తెలంగాణ సీఎం కేసీఆర్‌కి లేఖలు రాశామని తెలిపారు. ఆయన లేఖ రాసిన కాసేపటికే సెప్టెంబరు 17న జాతీయ సమగ్రతా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఐ ఈ సందర్భంగా నిజాం పాలనపై అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాం నిరంకుశ పాలన అనడం హాట్ టాపిక్‌గా మారింది. నిజాంది నిరంకుశ పాలనే అని తొలిసారి అన్నారు. సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపని ఎంఐఎం.. ఇప్పుడు జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట.. పాతబస్తీలో తిరంగా యాత్ర చేపట్టబోతోంది. ఎంఐఎంలో ఎంత మార్పు వచ్చిందని.. రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

  Telangana :సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యత దినోత్సవం..వజ్రోత్సవ వేడుకలకు తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం

  తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి బీజేపీ ఎప్పటి నుంచో టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తోంది. ఎంఐఎంకి భయపడే కేసీఆర్ సర్కార్ విమోచన దినోత్సవాలను జరపడం లేదని అమిత్ షాతో పాటు జేపీ నడ్డా, బండి సంజయ్ వంటి నేతలు టీఆర్ఎస్‌పై పలు సందర్భాల్లో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఉన్నది కారు ప్రభుత్వమే అయినా.. దాని స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉందని.. ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు.. జాతీయ సమైక్యతా నినాదాన్ని ఎత్తుకొని.. సెప్టెంబరు 17న ఉత్సవాలను జరుపుకోవాలని ప్రకటించడం విశేషం.

  తెలంగాణ ప్రభుత్వం జరపకపోయినా.. తామే అధికారికంగా నిర్వహిస్తామని.. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణ విమోచన వజ్రోత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీని ఆత్మ రక్షణలో పడేసే వ్యూహంలో భాగంగానే టీఆర్ఎస్, ఎంఐఎం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వేడుకలను వ్యతిరేకించినట్లయితే ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుందని.. అందువల్ల దానిని వ్యతిరేకించకుండా మరో రూపంలో వేడుకలను నిర్వహించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిర్ణయం ద్వారా ఇకపై టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలను విమర్శించడానికి బీజేపీకి అవకాశం లేకుండా పోతుందని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా సెప్టెంబరు 17 కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Asaduddin Owaisi, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు