టిక్ టాక్... ఈ యాప్ లేని మొబైల్ ఫోన్ అంటే ఉండదు. మరీ ముఖ్యంగా యూత్‌లో టిక్ టాక్ అనే పిచ్చి నరనరాల్లోకి ఎక్కేసింది. ఎప్పుడూ చూసిన టిక్ టాక్ వీడియోలు చేస్తూ..చూస్తూ అందులో మునిగి తేలిపోతున్నారు. చాలామంది ఈ పిచ్చిలో పడి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటే.. మరికొందరు ప్రాణాలు సైతం పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన టిక్ టాక్ యాప్‌ను పలు రాష్ట్రాలు నిషేధించే పనిలో పడ్డాయి. ఈ మేరకు తాజాగా ఏడు రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఫిర్యాదులు అందాయి.
ఆ ఏడు రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. యువతను విశేషంగా ఆకర్షిస్తున్న టిక్ టాక్‌తో చాలామంది చాలా మంది తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. పనులు పక్కన పెట్టి ఈ యాప్‌తో ఎక్కువ మంది కాలక్షేపం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఖమ్మం కార్పొరేషన్లో ఉద్యోగులు టిక్ టాక్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆ ఉద్యోగులపై బదిలీ వేటు పడింది.
తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు ఈ యాప్‌ను బ్యాన్ చేయాలని కోరుతూ ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశాయి. దీనిపై స్పందించిన కేంద్రం 24 ప్రశ్నలతో కూడిన నోటీసులను ఆయా యాప్‌ల నిర్వాహకులకు జారీ చేసినట్లు సమాచారం. ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో కేంద్రం హెచ్చరించింది. మరోవైపు టిక్ టాక్, హలో యాప్ నిర్వాహకులు ఇండియాలో వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతుండడం విశేషం. ఒక వేళ నిజంగానే టిక్ టాక్ యాప్ బ్యాన్ చేస్తే.. మరి యువత దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.