ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు మీద పులి.. భయంతో బైక్ బ్రేక్ వేసిన యువకులు.. ఆ తర్వాత..

ప్రతీకాత్మక చిత్రం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలంలో పులి కనిపించింది.

  • Share this:
    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం కమ్మర్ గాం నుంచి ద్విచక్ర వాహనం మీద బెజ్జూర్‌ వెలుతున్న ఇద్దరు యువకులకు పులి అడ్డు వచ్చింది. భయంతో ద్విచక్ర వాహనం మీద నుండి పడిపోయిన ఆ ఇద్దరు యువకులకి స్వల్ప గాయలయ్యాయి. పులి విషయం తెలిసిన స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా పులి ఎక్కడి నుండి వచ్చింది, ఎటు వెళ్ళి ఉంటుందని ఆరా తీస్తున్నారు. ఇద్దరు యువకులు తమకు జరిగిని అనుభవాన్ని కళ్లు కట్టినట్టు చెప్పారు. తాము వస్తున్న సమయంలో ఆ పులి రోడ్డుపక్కన పడుకుని ఉందని తెలిపారు. వాహనం వస్తున్న శబ్దం విన్న పులి.. తమ  బైక్ అక్కడకు రాగానే.. వెంటనే తమ బైక్ మీద నుంచి పైకి దూకింది. అదే సమయంలో వాళ్లు కూడా బ్రేక్ కొట్టారు. దీంతో ఇద్దరూ కింద పడ్డారు. వారికి గాయాలయ్యాయి. ఆ సమయంలో పులి వారి నుంచి పారిపోయింది.

    ఇటీవల నల్గొండ జిల్లాలో అటవీశాఖ అధికారులకు చిక్కిన చిరుతపులి చనిపోయింది. మర్రిగూడ మండలం రాజపేట తాండ గ్రామంలో రైతులు కట్టిన ఉచ్చులో చిరుతపులి పడింది. వారు అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. అటవీశాఖ అధికారులు, జూ సిబ్బంది వెళ్లి పట్టుకునే ప్రయత్నం చేశారు. వలకు చిక్కనట్టే చిక్కి తప్పించుకున్న చిరుత.. అటవీశాఖ, జూ సిబ్బందిపై దాడి చేసింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం తీవ్రంగా శ్రమించి, అతికష్టం మీద చిరుతను పట్టుకున్నారు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత బోనులో బంధించారు. అక్కడి నుంచి హైదరాబాద్ జూ పార్క్‌కు తరలిస్తుండగా ఆ చిరుతపులి చనిపోయింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: