• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • TIGER SEEN IN SINGARENI OPEN COST MINES IN KOMARAM BHEM ASIFABAD DISTRICT AK

సింగరేణి గనుల సమీపంలో పెద్దపులి...

ఓపెన్ కాస్ట్ గనుల సమీపంలో కనిపించిన పెద్దపులి

గత కొన్ని రోజుల క్రితం పెద్దపులి పట్టపగలే రోడ్డు దాటుతూ స్థానికులకు కనిపించింది.

  • Share this:
    ఓ వైపు శంషాబాద్‌లో హల్ చల్ చేసిన చిరుతపులి ఆచూకీ ఇంకా లభించకముందే... తెలంగాణలోని మరో ప్రాంతంలో పులి కనిపించడం ప్రజలను భయపెడుతోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను గత కొన్ని రోజులుగా పెద్దపులి భయాందోళనకు గురిచేస్తోంది. గతకొన్ని రోజుల క్రితం జిల్లాలోని తిర్యాని మండలం ఖైరి గూడ ఓపెన్ కాస్ట్ సమీపంలోని వాగులో నీరు తాగడానికి వచ్చిన పెద్దపులిని సింగరేణి కార్మికులు గమనించారు. తాజాగా మళ్ళీ ఈ రోజు ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ పరిసరాలలో పెద్దపులి సంచరిస్తూ కనిపించింది. తిర్యాని మండలంలో విస్తారంగా అటవీ ప్రాతం నుండి తరచు పెద్దపులి గ్రామ శివారులోకి వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

    పలుమార్లు పశువులపై పెద్దపులి దాడి చేసి హతమార్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. గత కొన్ని రోజుల క్రితం పట్టపగలే రోడ్డు దాటుతూ స్థానికులకు కనిపించింది. పట్టపగలే పులి ఇలా స్వేచ్చగా తిరుగుతుంటే శివారు గ్రామ ప్రజలు వణికిపోతున్నారు. అటు ఖైరిగూడ ఓపెన్ కాస్టులో పని చేసే కార్మికులు కూడా బిక్కుబిక్కుమంటు విధులకు హాజరవుతున్నారు. అటవీ అధికారులు స్పందించి పులి నుంచి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

    Published by:Kishore Akkaladevi
    First published: