Tiger: చెట్టు పైకెక్కి మాటేసిన పులి.. భయాందోళనలో గ్రామస్థులు.. ఎక్కడంటే..?

Tiger: చెట్టు పైకెక్కి మాటేసిన పులి.. భయాందోళనలో గ్రామస్థులు.. ఎక్కడంటే..?

చెట్టు పైకి ఎక్కిన పులి

Tiger Roaming: పులి ఏకంగా చెట్టు పైకి ఎక్కి సవారి చేస్తుండటంతో.. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

 • News18
 • Last Updated:
 • Share this:
  తెలంగాణలో కొద్దిరోజులుగా పులులు వనాలను వీడి జనారణ్యం లోకి సంచరిస్తుండటం ఆందోళనకు గురి చేస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలలో పలుమార్లు పులులు అడవుల మీదుగా గిరిజన గ్రామాలకు, అటునుంచి పట్టణాలకు కూడా వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. ములుగు జిల్లాలో కూడా పులి కనిపించింది. చెట్టు పైకి ఎక్కి మాటు వేసింది.

  ములుగు జిల్లా వాజేడు మండలం లో ఒక పులి చెట్టు పైకి ఎక్కింది. కొంగల జలపాతం సమీపంలోని అడవిలో సంచరిస్తూ ఓ చెట్టుపై ఉండడంతో దానిని గమనించిన యువకులు వీడియో తీశారు. కాగా.. ఈ కొంగల జలపాతం.. కొంగల గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.  గతంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచరించిన విషయం తెలిసిందే. పంట పొలాల్లో పనులు చేసుకుంటున్న వారిపై దాడి చేసిన పులి.. వేర్వేరు ఘటనల్లో ముగ్గురి ప్రాణాలు కూడా తీసింది. ఆ తర్వాత కొత్తగూడెం పారిశ్రామిక ప్రాంతంలోనూ పులి కదలికలు కనిపించాయి. అంతేగాక మూడు రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ వాగు దగ్గర కూడా చిరుత కనిపించింది. ఇక తాజాగా వాజేడులో పులి ఏకంగా చెట్టు పైకి ఎక్కి సవారి చేస్తుండటంతో.. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
  Published by:Srinivas Munigala
  First published: