హోమ్ /వార్తలు /తెలంగాణ /

Tiger: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దపులి కలకలం.. మణుగురు ఏరియాలో సంచారం

Tiger: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దపులి కలకలం.. మణుగురు ఏరియాలో సంచారం

పెద్దపులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు

పెద్దపులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు

ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి మణుగూరు ఏరియా ప్రకాశం గని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో పెద్దపులి కలకలం సృష్టించింది.

ఇంకా చదవండి ...

తెలంగాణలోని పలు జిల్లాలను పెద్దపులి వణికిస్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి మణుగూరు ఏరియా ప్రకాశం గని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో పెద్దపులి కలకలం సృష్టించింది. ఈ రోజు ఉదయం పెద్దపులి సంచరిస్తున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. వెంటనే ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్ కు పులి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన జీఎం రమేష్ పులి సంచరించిన పైపుల యార్డును పరిశీలించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే పులి సంచరించిన ప్రదేశంలో, యార్డులో కాలి వేలిముద్రలను అధికారులు గుర్తించారు. ఆ వేలి ముద్రలను ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. పులి సంచరించిందన్న వార్త తెలియడంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకుని తమకు పులి నుంచి రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణలోని ఏజెన్సీ ఏరియాలలో ఉంటున్న ఆదివాసులకు కొద్దిరోజులుగా కంటి మీద కునుకు లేకుండా పోతున్నది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఖమ్మం, వరంగల్ ఏజెన్సీ ఏరియాలలో పెద్దపులులు బయటకు వస్తుండటం.. జనాలను భయాందోళనలను గురి చేస్తున్నది. ఇక ఆసిఫాబాద్ లో అయితే ఇప్పటికే ఇద్దరు ఆదివాసీ బిడ్డలు పులి పంజాకు బలయ్యారు. ఈ నేపథ్యంలో ఇల్లు దాటి బయటకు రావాలంటేనే ఆదివాసీ జనం వణుకుతున్నారు. వారి పొలాలు అడవులకు దగ్గరగా ఉండటంతో.. పులి రావడం, దాడి చేసి చంపడం అంతా క్షణాల్లో జరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో పంట పొలాలలో తిరుగుతున్న పులిని పట్టుకోవాలని ఇటీవల ఆసిఫాబాద్ లో గిరిజనం రోడ్డెక్కారు.

ప్రజల ప్రాణాలను తీస్తున్న పెద్దపులిని వెంటనే బంధించి తమ ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో ఆదివాసి గిరిజనలు ధర్నా నిర్వహించారు. మొదట మండలం కేంద్రంలోని గాంధీ చౌక్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం బస్టాండ్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఇప్పటికే పెద్దపులి దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కాగా మరో ప్రాణం పోకముందే అవసరమైన చర్యలు తీసుకొని పెద్దపులిని బందించాలని, ఆదివాసీ గిరిజనుల ప్రాణాలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.

First published:

Tags: Bhadradri kothagudem, Singareni, Tiger, Tiger Attack

ఉత్తమ కథలు