హోమ్ /వార్తలు /తెలంగాణ /

Tiger: రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి.. ఆ పులేనా..?

Tiger: రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి.. ఆ పులేనా..?

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పులి..

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పులి..

Tiger Died In Road Accident: అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిరుత పులి మృతి చెందింది.

  • News18
  • Last Updated :

కొద్దికాలంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. పులి వార్తలతో హడలెత్తిపోతున్నది. ముఖ్యంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే గిరిజనం.. పులి పేరు చెబితేనే వణికిపోతున్నారు. ఇప్పటికే పంట పొలాలకు వెళ్లిన ఇద్దరిని పులి పొట్టన పెట్టకున్న విషయం తెలిసిందే. దానిని పట్టుకోవాలని గిరిజనం రోడ్డెక్కుతున్నారు. కాగా మరోవైపు తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక పులి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అయితే ఈ పులి.. ఆసిఫాబాద్ అడవులలో సంచరించేదేనా..? కాదా..? అనే విషయం తేలాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిరుత పులి మృతి చెందింది. గుడిహత్నూర్ మండలం మేకల గండివద్ద జాతీయ రహదారిపై ఆదిలాబాద్ నుండి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి చిరుతపులి ప్రాణాలు కోల్పోయింది.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే వెల్లడిస్తామని అటవీ అధికారులు తెలిపారు.

First published:

Tags: Adilabad, Telangana, Tiger

ఉత్తమ కథలు