ఎండాకాలం వచ్చిందంటే చాలు. యువకులు బావులు, నదులు, చెరువులు వెంట పడతారు. శరీరాన్ని వేడి నుంచి తప్పించుకోవడానికి నీటిలో దిగి ఈత కొడుతూ చల్లదనాన్ని ఆస్వాదిస్తారు. అయితే అలా ములుగు (Mulugu) జిల్లాలో గోదావరి నది (Godavari river)లో స్నానానికి దిగిన ముగ్గురు గల్లంతవడం (Boys missing) కలకలం రేపింది. గల్లంతైన వారిలో బాలుడితో పాటు ఇద్దరు యువకులు ఉన్నారు. ఏటూరునాగారం మండలం రొయ్యూరులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగాది పండగను పురస్కరించుకుని గ్రామస్థులు, యువకులు గ్రామ దేవతను గోదావరి నది స్నానానికి తీసుకెళ్లారు.
ఆ సమయంలో నది (Godavari river)లో స్నానానికి దిగిన బెడిక సతీశ్, సాయివర్ధన్, సందీప్‌లు గల్లంతు (Three youths drowned) అయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జాలర్లు గల్లంతైన ముగ్గురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సతీశ్, సాయివర్ధన్, సందీప్‌లు నీటిలో దిగి స్నానం చేస్తుండగా ప్రవాహం అధికంగా ఉండటంతో గల్లంతైనట్లు సమాచారం. ప్రమాదంలో గల్లంతైన విద్యార్థులలో ఇద్దరు ఇంటర్మీడియెట్, మరో విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది.
గతంలోనూ ఇలాగే..
స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్లిన ఓ వ్యక్తి గతంలో చెరువులో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన ములుగు (Mulugu) జిల్లాలో లక్నవరం జలాశయం వద్ద చోటుచేసుకుంది. గల్లైంతన వ్యక్తిని హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సుధాకర్‌గా గుర్తించారు. వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సుధాకర్ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. క్రిస్మస్, వీకెండ్ కలసి రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు లభించాయి. దీంతో దాదాపు 18 మంది యువతి, యుకులు శుక్రవారం లక్నవరం చెరువును సందర్శించేందుకు వచ్చారు. అందులో సుధాకర్ కూడా ఉన్నాడు.
అయితే ఈ బృందంలో కొందరు చెరువుపై ఉన్న ఉయ్యాల వంతెన పై నుంచి రెస్టారెంట్‌కు రెస్టారెంట్‌కు వెళ్లారు. సాయంత్రం సుధాకర్ చెరువుకట్టపై మెట్ల ప్రాంతంలో ఉంగా ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడిపోయారు. ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. అప్పటికే చీకటి పడటంతో పక్కనే ఉన్న స్నేహితులు కూడా ఏం చేయలేకపోయారు.
చెరువులో ఈత కొట్టేందుకు..
సిద్దిపేటలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. బెజ్జంకి మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన ఐఐటి విద్యార్ధి పొన్నాల అనిల్(17), కరీంనగర్ జిల్లా మానాకొండూరు మండలం రంగంపేట గ్రామానికి చెందిన నంగునూర్ కుమార్ (29) అనే ఇద్దరు యువకులు సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈత కొట్టే సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయారు. అయితే సమాచారం అందుకున్నగ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. చెరువులో యువకుల కోసం గాలించగా.. ఒకరి మృతదేహం లభ్యమయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Godavari river, Missing person, Mulugu