• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • THREE YOUTH DRUNK AND DRIVING LEADS TO AN SI HOSPITALIZATION IN BHADRADRI KOTHAGUDEM DISTRICT HSN

ఏపీ, తెలంగాణ సరిహద్దులో చెకింగ్.. స్కూటీపై కుర్రాళ్ల త్రిబుల్ రైడింగ్.. ఆస్పత్రిపాలయిన ఎస్సై.. అసలేం జరిగిందంటే..

ఏపీ, తెలంగాణ సరిహద్దులో చెకింగ్.. స్కూటీపై కుర్రాళ్ల త్రిబుల్ రైడింగ్.. ఆస్పత్రిపాలయిన ఎస్సై.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

వాహనాల తనిఖీలు జరుగుతున్నాయని ఉందని తెలిస్తే బైకర్లు స్లో అవుతుంటారు. డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఏమీ తమ వద్ద లేకపోతే అడ్డదారుల్లో తప్పించుకుంటుంటారు. కానీ ఆదివారం ఓ విచిత్ర ఘటన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగింది. ముగ్గురు కుర్రాళ్ల నిర్వాకం వల్ల..

  • Share this:
    సినిమాల్లో కొన్ని రకాల సీన్లను చూసి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటుంటారు. కిక్ సినిమాలో బ్రహ్మానందం బైక్ నడుపుతూ ఓ పోలీసు ఉన్నతాధికారినే ఢీకొడతాడు. ఈ సీన్ ను చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వని ప్రేక్షకుడు ఉండడు. ఇలాంటి సీన్లు కేవలం సినిమాల్లోనే కనిపిస్తుంటాయి. రియల్ లైఫ్ లో చెకింగ్ జరుగుతూ ఉందని తెలిస్తే బైకర్లు స్లో అవుతుంటారు. డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఏమీ తమ వద్ద లేకపోతే అడ్డదారుల్లో తప్పించుకుంటుంటారు. కానీ ఆదివారం ఓ విచిత్ర ఘటన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగింది. ముగ్గురు కుర్రాళ్ల నిర్వాకం వల్ల వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్సై ఆస్పత్రి పాలవాల్సి వచ్చింది. మద్యం మత్తులో అతివేగంగా వచ్చి ఎస్సైని ఢీకొట్టారా కుర్రాళ్లు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

    పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పాములవారి గూడేనికి చెందిన ముగ్గురు కుర్రాళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట మండలం మామిళ్లవారి గూడెంలో స్నేహితుడి పెళ్లి రిసెప్షన్ కు హాజరయ్యారు. ఆ విందులో పూర్తిగా మద్యం మత్తులో మునిగిపోయారు. ఆదివారం రాత్రి తిరిగి తమ ఊరికి ఒకే స్కూటీపై బయలుదేరారు. మార్గమధ్యంలో అశ్వారావుపేట ఎస్సై మధు ప్రసాద్, తన సిబ్బందితో కలిసి భద్రాచలం మార్గంలో ఊట్లపల్లి సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. త్రిబుల్ రైడింగ్, ఆపై మద్యం మత్తులో వస్తున్న ఆ ముగ్గురు కుర్రాళ్లు దీన్ని గమనించారు. వారికి దొరక్కుండా అతి వేగంగా వెళ్తే ఎస్కేప్ అవొచ్చని అనుకున్నారు.

    Three, Youth, Drunk and Driving,  SI, hospitalisation, Bhadradri Kothagudem, Khammam, ఏపీ, తెలంగాణ, సరిహద్దు, డ్రంక్ అండ్ డ్రైవింగ్, మద్యం మత్తు, త్రిపుల్ రైడింగ్, ఎస్సై, తనిఖీలు,
    ఆస్పత్రి పాలయిన అశ్వారావుపేట ఎస్సై మధు ప్రసాద్


    దీంతో అతి వేగంగా ఆ స్కూటీపై వచ్చారు. అదే సమయంలో వారిని ఆపేందుకు ఓ కానిస్టేబుల్ రోడ్డు మీదకు వచ్చాడు. ఆ కానిస్టేబుల్ ను తప్పించేక్రమంలో పక్కనే ఉన్న ఎస్సైని స్కూటీతో ఢీకొట్టారు. ఎస్సై కొద్ది దూరంలో పడిపోగా, ఆ ముగ్గురు కుర్రాళ్లు కూడా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎస్సై, కాలు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ముగ్గురు కుర్రాళ్లు డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా, అతిగా మద్యం తాగారని తేలింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి గురయిన ఎస్సై మధు ప్రసాద్ ను అశ్వారావు పేట ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సీఐ ఉపేందర్ రావు ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు.
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు