Nizamabad : గత మూడు రోజుల క్రితం నిజాబాబాద్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కిడ్నాప్‌కు గురైన
మూడేళ్ళ చిన్నరి మిస్టరీ వీడింది.. పాప అడ్రస్ లభ్యం కావడంతో పాటు కిడ్నాపర్‌ను మహారాష్ట్ర లో
పట్టుకున్నట్టు సమాచారం.
గత మూడు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి హనీ ఆచూకీ లభ్యమైంది.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నర్సిలో పాపను పోలీసులు వారి సంరక్షణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో పాప ఆచూకి లభించినట్లు తెలుస్తోంది. పాపను తీసుకుని పోలీసులు నిజామాబాద్ కు బయల్దేరారు. కిడ్నాప్ తర్వాత అలర్ట్ అయిన పోలీసులు సీసీ కెమెరాల ద్వార కిడ్నాపర్ మహారాష్ట్ర వైపు వెళ్లినట్టు గమనించిన పోలీసులు అక్కడి పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో మూడు రోజుల ఆపరేషన్ తర్వాత చిన్నారీ ఆచూకి లభించడంతో పాప తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
శుక్రవారం నాడు జగిత్యాల జిల్లా సాయంత్రం జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన నూరిన్ తన మూడేళ్ల కూతురు హని పాటు తల్లితో కలిసి షాపింగ్ వెళ్లింది. ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తుండగా షాపింగ్ మాల్లోనే హనీ ఆడుకుంటుంది. దీంతో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించి షాపింగ్‌లో మునిగిపోయారు. షాపింగ్ మాయలో పడి తన కూతురునే మరచి పోయింది.. దీంతో ఓ వైపు తల్లి షాపింగ్ చేస్తుండగానే మరోవైపు చిన్నారీ కనిపించకుండా పోయింది.. దీంతో కంగారు పడిన తల్లి షాపింగ్ మాల్ మొత్తం వెతికింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మాల్లోని సీసీ కెమెరాలను ( cc camera ) పరీశీలించారు. చిన్నారిని ఇద్దరు బురఖా ధరించిన వ్యక్తులు తీసుకువెళ్లినట్టు గుర్తించారు. వారు మహారాష్ట్ర వైపు వెళ్లడంతో అక్కడి పోలీసులను అలర్ట్ చేసిన పోలీసులు మూడు రోజుల అనంతరం కేసును చేధించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.