illegal affair : అక్రమానికి అడ్డుగా ఉన్నాడని.. మూడేళ్ల బాలుడిని కొట్టి చంపిన అమ్మ...!

అక్రమానికి అడ్డుగా ఉన్నాడని.. మూడేళ్ల బాలుడిని కొట్టి చంపిన అమ్మ...!

illegal affair : అమ్మతనానికి మచ్చ తెచ్చింది ఓ మహిళ.. తన స్వేఛ్చ జీవితానికి అడ్డువస్తున్నాడని అభం శుభం తెలియని చిన్నారిని వైర్లతో విచక్షణ రహితంగా కొట్టి గాయపర్చింది..దెబ్బలకు తాళాలేక చిన్నారి ఏడుస్తుంటే తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లింది... కాని అప్పటికే ఆమె కొపానికి బలైపోయాడని వైద్యులు చెప్పారు..

  • Share this:
తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డపై ఓ తల్లి కర్కశంగా ప్రవర్తించింది. ఎందుకు కొడుతుందో తెలియని చిన్నారీ... వద్దూ అన్నా... పట్టించుకోకుండా మానవత్వాన్ని మంటగలిపింది..తన చేతికి దొరికిన వస్తువుతో చితకబాదింది.. దీంతో ఆ చిన్నారీ ఒళ్లంతా దెబ్బలకు బోబ్బలెక్కాయి.... ఎర్రగా వాతలు తెలాయి..మంటకు తాళలేక సొమ్మసిల్లి పడిపోయాడు..అప్పుడు కనికరించి ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే పిల్లాడు ప్రాణాలు విడిచిన సంఘటన హైదరాబాద్ నగరంలోని జీటిమెట్ల పోలీస్ స్టేషన్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే సూరారంలో ఉంటున్న సురేష్, ఉదయలు భార్యభర్తలు వీరికి ఉమెష్ అనే మూడెళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.. అయితే భార్యభర్తల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఇద్దరు సంవత్సర కాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈనేపథ్యంలోనే చింతల్ ప్రాంతానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తితో ఉదయకు పరిచయం ఏర్పడింది..  ఉన్న పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది. దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉంటాడనే కోపంతో ఉదయ తన స్వంత కొడుకు అని చూడకుండా పిల్లాడిని చిత్రహింసలకు గురి చేసేది..దీనికి తోడు భర్త దూరంగా ఉండడం కూడా ఆమె మానసిక వేదనకు గురయినట్టు స్థానికులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఉమేష్‌ను మరోసారి మంగళవారం ఉదయం అందుబాటులో ఉన్న కరెంటు వైర్లతో చితకబాదింది.తాను ఏం చేస్తున్నానో తెలియకుండా విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు కొట్టింది. దీంతో కాసేపటికే ఉమేష్ సోమ్మసిల్లిపోయాడు..అయినా ఆ తల్లి కనికరించలేదు..ఉదయం నుండి సాయంత్రం వరకు అలాగే ఉంచింది.. చివరికి సాయంత్రం నాలుగు గంటలకు సమీపంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు..కాగా బాలుడిపై విపరీతమైత దెబ్బలు ఉండడంతో అనుమానం వచ్చిన వైద్యులు సూరరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..ఇక ఇన్నాళ్లు పట్టించుకోని తండ్రి బాలుడు చనిపోవడంతో భార్యపై అక్రమ సంబంధం ఆరోపణలు చేశాడు.. ఆమె వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే నెపంతోనే కొట్టి చంపారని భర్త సురేష్ ఆరోపించాడు..
Published by:yveerash yveerash
First published: