మళ్లీ స్వైన్‌ఫ్లూ స్వైర విహారం... బీ అలర్ట్

గతేడాది నుంచి స్వైన్ ఫ్లూ బారిన పడే బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.చనిపోయిన వారిలో ఎక్కువ మంది ప్రైవేటు ఆసుపత్రుల నుంచి ఆఖరు నిమిషంలో గాంధీలో చేరిన వారేనని డాక్టర్లు చెబుతున్నారు.

news18-telugu
Updated: January 8, 2019, 8:25 AM IST
మళ్లీ స్వైన్‌ఫ్లూ స్వైర విహారం... బీ అలర్ట్
స్వైన్ ఫ్లూ భాదితులకు చికిత్స చేస్తున్న సిబ్బంది
  • Share this:
తెలంగాణలో మరోసారి స్వైన్ ‌ఫ్లూ విస్తరిస్తుంది. తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మూడు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఎన్1హెచ్1 వైరస్ లక్షణాలతో ముగ్గురు పేషెంట్లు ఆస్పత్రిలో చేరారు. చలి తీవ్రత పెరగడంతో స్వైన్ ఫ్లూ వైరస్ పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సిద్దిపేటకు చెందిన 39 ఏళ్ల వ్యక్తి, ఉప్పల్‌లో నివసించే 28 ఏళ్ల యువతితో పాటు... ఆల్వాల్‌కు చెందిన 43 ఏళ్ల మరో వ్యక్తి కూడా స్వైన్ ఫ్లూ వైరస్‌ బారిన పడినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. మరోవైపు హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఇప్పటికే ఇద్దరు ఇవే లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. సాధారణంగా అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు చలి తీవ్రంగా ఉంటుంది. ఆ సమయంలో ఎన్1హెచ్1 వైరస్ వ్యాప్తికి ఎక్కువగా అవకాశముంటుంది.

అయితే గతేడాది నుంచి స్వైన్ ఫ్లూ బారిన పడే బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అక్టోబరులో 30 మంది, నవంబరులో 19, డిసెంబరులో 18 మందికి స్వైన్‌ఫ్లూ బారినపడి గాంధీ ఆసుపత్రిలో చేరారు. వీరిలో 18 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది ప్రైవేటు ఆసుపత్రుల నుంచి ఆఖరు నిమిషంలో గాంధీలో చేరిన వారేనని డాక్టర్లు చెబుతున్నారు. ఉస్మానియాలో గత డిసెంబరు వరకు 11 మంది ఇవే లక్షణాలతో చనిపోయారు.

గాలిలో కలిసి ఉన్న ఎన్‌1హెచ్‌1 వైరస్‌ చలి పెరిగిన సమయంలో విస్తరిస్తుంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువ శాతం స్వైన్‌ఫ్లూ బారిన పడే అవకాశం ఉంది. మిగతా వారితో పోల్చితే వీరిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో త్వరగా సోకుతుంది. జ్వరం, గొంతునొప్పి, ముక్కు కారటం, దగ్గు, ఒళ్లు నొప్పులు, తీవ్ర నీరసం వంటి ఆరోగ్య సమస్యలు వేధిస్తే... వెంటనే అశ్రద్ధ చేయకుండా డాక్టర్లను సంప్రదించండి. స్వైన్ ఫ్లూ నుంచి అప్రమత్తంగా ఉన్నండి.
First published: January 8, 2019, 8:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading