హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sad news : బర్త్ డే అని ఫ్రెండ్స్‌తో గుడికెళ్తే .. ఆ ముగ్గుర్ని మృత్యువు మింగేసింది

Sad news : బర్త్ డే అని ఫ్రెండ్స్‌తో గుడికెళ్తే .. ఆ ముగ్గుర్ని మృత్యువు మింగేసింది

STUDENTS DIED

STUDENTS DIED

Sad news: ఇద్దరి పుట్టిన రోజు ...మూడు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ఈవిషాద సంఘటన చోటుచేసుకుంది. ఈత సరదా ముగ్గురు విద్యార్ధుల ప్రాణాలు తీస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Medchal, India

ఇద్దరి పుట్టిన రోజు ...మూడు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి(Medchal Malkajgiri)జిల్లాలో ఈవిషాద సంఘటన చోటుచేసుకుంది. ఈత సరదా ముగ్గురు విద్యార్ధుల ప్రాణాలు తీస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. కీసర( Keesara)పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల్ (Chiryal)గ్రామంలోఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చిర్యాల్ నాట్కం చెరువులో మునిగి చనిపోయారు. బుధవారం(Wednesday)హరహరన్(Haraharan), ఉబేద్(Ubed)అనే ఇద్దరు విద్యార్థుల బర్త్ డే సందర్భంగా.. తొమ్మిది మంది విద్యార్థులు చిర్యాల్ లక్ష్మీ నరసింహస్వామి(Lakshmi Narasimhaswamy)ఆలయానికి వెళ్లారు.

Extra marital affair : రాసలీలల కేసులో బుక్కైన TRSనేత .. బాధితుడ్నే కిడ్నాప్ చేయించినందుకు కేసు నమోదు

పుట్టిన రోజు నాడే విషాదం..

ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈత కొట్టాలనే సరదా వాళ్లను మృత్యువుకు పరిచయం చేసింది. ఈత కొట్టడానికి చిర్యాల నాట్కం చెరువుకు వెళ్లారు. ఈత కొడుతుండగా ముగ్గురు విద్యార్థులు నాట్కం చెరువులో గల్లంతయ్యారు. మిగతా విద్యార్థులు చూస్తుండగానే ముగ్గురూ నీటిలో మునిగిపోయారు. మొత్తం తొమ్మిది మంది స్టూడెంట్స్‌ కలిసి వెళ్తే ..ముగ్గురు విద్యార్ధులు మిగిలిన వాళ్లంతా చూస్తుండగానే జలసమాధి కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

ప్రాణాలు తీసిన ఈత సరదా..

తొమ్మిది మంది విద్యార్థులు తీగల కృష్ణారెడ్డి కాలేజీలో చదువుతున్నారు. వీరంతా డిప్లోమా థర్డ్ ఇయర్ చదువుతున్నారు. విషయం తెలియగానే కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలాజీ అనే విద్యార్థి డెడ్ బాడీని చెరువు నుంచి బయటకు వెలికితీశారు. మిగతా ఇద్దరు విద్యార్థుల మృతదేహాల కోసం స్థానికుల సహయంతో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చనిపోయిన వారిలో హరిహరన్, ఉబేద్, బాలాజీ ఉన్నారు. మిగతా ఆరుగురు విద్యార్థులను కీసర పోలీసుల అదుపులో ఉన్నారు. కుమారుల మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Malkajgiri police, Telangana News

ఉత్తమ కథలు