హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఒకే గ్రామంలో ముగ్గురు మృతి.. అది సేవించడమే కొంపముంచిందా.. అసలేం జరిగింది..

Telangana: ఒకే గ్రామంలో ముగ్గురు మృతి.. అది సేవించడమే కొంపముంచిందా.. అసలేం జరిగింది..

ఇంటికి వచ్చిన చైతన్యపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న వ్యవసాయ పనిముట్లతో దాడి చేసి ప్రాణం తీశారు. దీంతో శవాన్ని మాయం చేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. తాము ఉన్న ఇళ్లు ఖాళీ చేస్తున్నట్టు చుట్టుపక్కల వారిని నమ్మించారు.

ఇంటికి వచ్చిన చైతన్యపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న వ్యవసాయ పనిముట్లతో దాడి చేసి ప్రాణం తీశారు. దీంతో శవాన్ని మాయం చేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. తాము ఉన్న ఇళ్లు ఖాళీ చేస్తున్నట్టు చుట్టుపక్కల వారిని నమ్మించారు.

Telangana: కల్తీకల్లు తాగి ముగ్గురు మృతి చెందినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్న సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండలం జల్లాపురం లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా అదే గ్రామానికి చెందిన జిల్లా కీలక ప్రజా ప్రతినిధి కుటుంబ సభ్యులు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇంకా చదవండి ...

(సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)

కల్తీ కల్లు తాగిన మృతుల కుటుంబ సభ్యులు స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 7వ తేదీన గ్రామానికి చెందిన సిద్దయ్య (47), వెంకట్ రాముడు (54), వెంకన్న (60) కల్లు తాగడానికి కల్లు కాంపౌండ్ వద్దకు వెళ్లారు. కాంపౌండ్ వద్ద కల్లు తాగి అదే రోజు రాత్రి మృతి చెందారు. వెంకట్ రాముడు రాత్రి 9 గంటలకు సమయంలో కల్లు తాగి ఇంటికి వచ్చి.. రొట్టె తింటూ నురగలు కక్కుతూ అక్కడికక్కడే మృతి చెందారని ఆమె భార్య సరోజమ్మ తెలిపారు. వెంకన్న ప్రతిరోజు కల్లు తాగుతారని ఆరోజు తాగొచ్చి రాత్రి చనిపోయారని ఆయన భార్య నాగేశ్ అమ్మ తెలిపారు. సిద్దయ్య మాత్రం కల్లు తాగి చనిపోలేదని అతడి భార్య తెలిపింది. ఈ సంఘటన ఈనెల ఎనిమిదో తేదీ ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టికి వెళ్ళింది. వారు మాత్రం ఇలాంటి విచారణ జరపకుండా గోప్యంగా ఉండడం పలు అనుమానాలకు తావి తీస్తుంది ఒకే రోజు కల్లు తాగిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందడం గ్రామాల్లో కలకలం సృష్టించింది. కల్తీకల్లు కారణంగానే వారు మృతి చెందారని స్థానికంగా ప్రచారం జరుగుతుండగా.. మరికొందరు అస్వస్థత గురయ్యారని తర్వాత కోలుకున్నారని స్థానికులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా ఇలాంటి ఎన్నో పెద్ద సంఘటనలు జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్తీకల్లు రాజ్యమేలుతుంది. జోగులాంబ గద్వాల మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్ జిల్లా , నారాయణపేట జిల్లా, వనపర్తి జిల్లాలో కల్తీకల్లు తయారీలో ప్రత్యేక మాఫియా తయారయింది. ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్లు లో కలిపే నిషేధిత క్లోరో హైడ్రేట్ సిహెచ్ ఆల్ఫా జలం పదార్థాలు విచ్చలవిడిగా కల్లు కాంపౌండ్ లలో తయారవుతున్నాయని పలువురు చెప్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చాలామంది పనులు లేక ఇంట్లో ఉంటున్నారు. లిక్కర్ లకు అలవాటైన వారి చేతులలో డబ్బులు లేకపోవడంతో కల్లు కంపౌండ్ పైపు మళ్లుతున్నారు.

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో తాటి, ఈత చెట్లు లేకున్నా డ్రమ్ముల కొద్ది కల్లు కాంపౌండ్ లో దర్శనమిస్తున్నాయి. అందులో సీహెచ్ కలుపుతూ ఉండడంతో దాన్ని తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతేడాది లాక్ డౌన్ లొనే జడ్చర్ల మండలంలోని ఆలూరు లో కల్తీకల్లు తాగి ఇద్దరు మృతి చెందగా.. ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో ముగ్గురు చనిపోవడం కలకలం రేపుతోంది. ఇప్పటికైనా జిల్లా ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో ఉండకుండా ప్రజలను కాపాడాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి.

చర్యలు తీసుకుంటాం..

కల్లు కాంపౌండ్ లో కల్తీకల్లు విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నామని మానవపాడు మండలం జిల్లా పురం లో జరిగిన సంఘటనపై కూడా విచారణ జరుపుతామని మహబూబ్ నగర్ జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఖురేషి అన్నారు. సిహెచ్ సరఫరా చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.

First published:

Tags: Died, Mahabubnagar, Telangana, White alcohol

ఉత్తమ కథలు