హోమ్ /వార్తలు /తెలంగాణ /

దేవుడి రథాన్ని గుళ్లోకి తీసుకెళ్తుండగా ఘోరం.. ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే మృతి

దేవుడి రథాన్ని గుళ్లోకి తీసుకెళ్తుండగా ఘోరం.. ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Nalgonda: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దేవుడి రథాన్ని గుళ్లోకి తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్ కొట్టి ముగ్గురు వ్యక్తులు మరణించారు.

దేవుడి రథాన్ని ఆలయాంలోకి తీసుకెళ్తున్న క్రమంలో ఘోరం జరిగింది. రథానికి (Temple Chariot) విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు వ్యక్తులు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ (Nalgonda) జిల్లా నాంపల్లి మండలం కేతెపల్లిలో ఈ విషాదకర శనివారం నాడు ఘటన చోటు చేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం... కేతపెల్లి గ్రామంలో ఇటీవల శ్రీరామనవి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రామాలయంలోని మూల విరాట్టును ఇనుప రథంలో ఆలయ పరిసరాల్లో ఊరేగించారు. ఆ తర్వాత రథాన్ని గుడిలోకి తీసుకెళ్లలేదు. అప్పటి నుంచీ ఆరు బయటే ఉంది. చాలా రోజుల నుంచి రథం ఆరుబయటే ఉండడాన్ని ఆలయ దాత పస్పూరు దయానందరెడ్డి గుర్తించారు. ఆ రథాన్ని వెంటనే గుడి ప్రాంగణంలోకి తీసుకెళ్లాలని గ్రామస్తులను కోరారు.

Shocking:రంపంతో కోసి భార్యా,పిల్లలను దారుణంగా హత్య చేశాడు..ఆపై..

శనివారం కొందరు గ్రామస్తులు రథాన్ని ఆలయంలోకి తీసుకెళ్లు ప్రయత్నం చేశారు. పది, పదిహేను మంది రథాన్ని లాగారు. ఐతే అదే సమయంలో 11 కేవీఏ విద్యుత్ తీగలు రథం పైభాగాన్ని తాకాయి. అది ఇనుప రథం కావడంతో విద్యుత్ ప్రసరించి... రథాన్ని లాగుతున్న వారికి షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే మరణించారు. మృతులను కేతెపల్లి గ్రామానికి చెందిన రాజబోయిన యాదయ్య(38), పొగాకు మోహన్ (40), గుర్రంపోడు మండలం మక్కపల్లికి చెందిన దాసరి ఆంజనేయులు(25)గా గుర్తించారు. పలువురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో.. వారిని నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Church Food Event : చర్చి కార్యక్రమంలో తొక్కిసలాట..31మంది మృతి

గత నెలలో తమిళనాడులో కూడా ఇలాంటి ప్రమాదంమే చోటుచేసుకుంది. తంజావూరు జిల్లా కలిమేడులో జరిగిన ఆలయ రథోత్సవం(Temple chariot festival)లో అపశృతి చోటు చేసుకుంది. రథానికి కరెంట్ వైర్లు తగలడంతో.. విద్యుత్ షాక్ కొట్టి.. 11 మంది భక్తులు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కలిమేడులో ఉన్న అయ్యప్ప ఆలయంలో ప్రతి ఏటా రథోత్సవం జరుగుతుంది. కరోనా వల్ల గత రెండేళ్లు ఎలాంటి వేడుకలు జరగలేదు. ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉండడంతో ఘనంగా రథోత్సవాన్ని నిర్వహించారు. '94 అప్పర్ గురుపూజై ' వేడుకలను వైభవంగా జరిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 26న ఆలయ వీధుల్లో రథోత్సవం నిర్వహించారు. భక్తుల పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. ఐతే ఈ క్రమంలో విద్యుత్ వైర్లు రథాన్ని తాకడంతో.. దాన్ని లాగుతున్న భక్తులకు కరెంట్ షాక్ కొట్టింది.10 మంది స్పాట్లోనే మరణించారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

First published:

Tags: Crime, Crime news, Nalgonda, Telangana

ఉత్తమ కథలు