యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చౌటుప్పల్ మండలం ఆరేగూడెం పంతంగి టోల్ ప్లాజా వద్ద డీసీఎంను ఓ బైకు ఢికొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురికి తీవ్ర గాయాలు కాగా బైక్ పై వెళుతున్న ముగ్గురు మృతి చెందారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా మృతులు చౌటుప్పల్ మండలం లక్కారం వాసులుగా గుర్తించారు. నేషనల్ హైవే కావడంతో ప్రమాదం జరిగిన తర్వాత భారిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపారు.
ఓపిక నశిస్తే పోరాటమే .. కేంద్రానికి అల్టిమేటమ్ ఇచ్చిన మంత్రి కేటీఆర్ .
కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లోనైనా రాష్ట్రానికి న్యాయం చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈమేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఆ లేఖను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కూడా పంపిస్తున్నామని, రాజకీయాలు మాని.. రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయాలని కేటీఆర్ హితవు పలికారు. ఓపిక నశిస్తే పోరాటానికి కూడా దిగాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఏడు సంవత్సరాలుగా చేనేత కార్మికుల సమస్యలపై పోరాడుతున్నా కేంద్రం స్పందించడం లేదని అన్నారు. వీటితో పాటు కేంద్రానికి రాసిన లేఖలో వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.897.92 కోట్లు మంజూరు చేయాలని, దాంతోపాటు ప్రాజెక్టుకు అనుమతి త్వరగా ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు.
Adilabad : ఇళ్ల బాట పట్టిన కలెక్టర్లు.. జ్వర సర్వే పై రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు
కేఎంటీపీ వంటి భారీ ప్రాజెక్ట్‌లు సముచితంగా లబ్ధి పొందేందుకు వీలుగా 'టెక్స్టైల్ మరియు అపెరల్ సెక్టార్ తయారీ ప్రాంతాల అభివృద్ధి (MRTA)' విధానాన్ని ఖరారు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌లో 1200 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ అయ్యే విధంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను అభివృద్ధి చేస్తుందని, 'ఫైబర్ టు ఫ్యాషన్' కాన్సెప్ట్ ఆధారంగా, అత్యాధునిక సౌకర్యాలతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ రూపుదిద్దుకుంటున్నట్టు ఆయన చెప్పారు.
Hyderabad : కోతుల నియంత్రణపై సమీక్ష.. రాష్ట్రంలో ఆరులక్షల కోతులు... వాటిని ఏం చేద్దాం...?
సిరిసిల్లలో మెగా పవర్‌లూం క్లస్టర్‌ను మంజూరు చేయాలన్నారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ 993.65 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం రూ.49.84 కోట్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. సిరిసిల్లలోని టెక్స్టైల్ పార్క్, చేనేత, అపెరల్ పార్కుల నిర్వహణకు, వివిధ ఖాళీలను భర్తీ చేసేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆధునీకరణ.. ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడం, మార్కెట్ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యం పెంపుదల.. పరిపాలన, అధ్యయనాల నిమిత్తమై కేంద్రం వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.