తల్లి ఆరోగ్యం క్షిణించడం..లాక్డౌన్ ఆర్ధిక పరిస్థితులు,పొరుగు వారితో ఆస్థితగదాలు వెరసి కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది..ఈ నెల తీర్థయాత్రలకని వెళ్లి శవమై తేలారు. మృతుల్లో తల్లి, కుమారుడు, కూతురు ఉన్నారు.
మహబుబ్నగర్ జిల్లా దేవరకద్ర పోలీస్స్టేషన్లో పరిధిలోని దేవరకద్రకు చెందిన బాలక్రిష్ణమ్మ 55, కుమారుడు రాజు , కూతురు సంతోషతో కలిసి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కోనసాగిస్తున్నారు..అయితే తల్లి బాలక్రిష్ణమ్మ గత వారం రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతోంది..మరోవైపు లాక్డౌన్ కారణంగా వ్యాపారం కూడ సరిగా నడవకుండా నష్టాలు ఎదుర్కోంటున్నారు.దీనికి తోడు పొరుగు వారితో ఆస్తితగదాలు సైతం చెలరేగుతున్నాయి..
ఈ నేపథ్యంలోనే కుటుంబం మొత్తం డిప్రేషన్లోకి వెళ్లిపోయింది..తమను ఆదుకునేవారు లేక మనస్థాపం చెందారు. చివరకు మన్యంకొండ దేవాలయానికి వెళుతున్నామని బంధువులకు చెప్పి సోమవారం బయలు దేరి వెళ్లారు. సోమవారం నుండి ఇంటికి తిరిగి రాలేదు. అయితే బుధవారం సాయంత్రం చౌదర్ పల్లి గుట్టపై మొక్కలకు నీరు పోయడానికి వెళ్లిన కూలీలకు మూడు శవాలు కనిపించాయి..కుళ్లిన వాసన వస్తుండడంతో అటు వెళ్లిన కూలిలు గమనించినట్టు పోలీసులుకు పిర్యాధు చేశారు. పోలీసులు వచ్చి దర్యాప్తు చేయగా రెండు రోజుల క్రితం వీరు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Death, Mahabubnagar