హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar : చేనేత కుటుంబంలో విషాదం.. కొడుకుతో సహా తల్లిదండ్రుల ఆత్మహత్య.

Karimnagar : చేనేత కుటుంబంలో విషాదం.. కొడుకుతో సహా తల్లిదండ్రుల ఆత్మహత్య.

కుటుంబం ఆత్మహత్య

కుటుంబం ఆత్మహత్య

Karimnagar : కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యలకు అప్పుల బాధ కారణమని తెలుస్తోంది.

తెలంగాణలోని మరో కుటుంబం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే ఒకే ఇంట్లోని దంపతులతో పాటు కుమారుడుతో సహా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లిలో నివాసం ఉంటున్న బైరి శంకరయ్య(55), జమున(50) భార్య భర్తలు కాగా కొడుకు శ్రీధర్ సహా తమ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

అనంతంర పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. కాగా ఆ కుటుంబం ముగ్గురు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం వెనక అప్పులే కారణమని ప్రాధమికంగా చెబుతున్నారు. కొడుకు తోపాటు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. పెద్ద కూతురుకు ఇదివరకే పెళ్లి కాగా చిన్న కూతురుకు మూడు నెలల క్రితమే పెళ్లి చేశారు. కొడుకు శ్రీధర్ ఓ ప్రైవేట్ కంపనీలో ఉద్యోగం చేస్తున్నట్టు స్థానికులు తెలిపారు. చేనేత మగ్గాలపై ఆధారపడిన కుటుంబం ఇటివల అందుకు సంబంధించి పనులు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చెబుతున్నారు. దీంతో ముగ్గురు ఒకేసారి తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.


Siddipet : రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడమే ఆ దోపిడికి అసలు కారణమా..? సిద్దిపేట కాల్పుల నిందితులు అరెస్ట్..

కాగా ఇటివల ఖమ్మం జిల్లాలో వనమా రాఘవ వేధింపులతో పాటు అప్పుల ఊబిలో కూరుకుపోయిన రామకృష్ణ తన భార్య పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు భార్య,భర్తలతో పాటు ఇద్దరు కొడుకులు కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు సైతం రాష్ట్రంలో కలకలం రేపాయి.. ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు కుటుంబాలకు కుటుంబాలే ఆత్మహత్య చేసుకుంటున్న వారికి ప్రభుత్వ అధికారులు భరోసా కల్పిస్తే కాని ఇలాంటి ఆత్మహత్యలు ఆగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు..

First published:

Tags: Family suicide, Karimnagar

ఉత్తమ కథలు