బీజాపూర్: చత్తీస్‌గఢ్ - తెలంగాణ సరిహద్దులో పోలీసులు, నక్సలైట్లకు మధ్య సోమవారం ఉదయం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణలోని ములుగు జిల్లా, చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. తెలంగాణ పోలీస్, గ్రే హౌండ్స్ ఆధ్వర్యంలో జరిగిన కూంబింగ్ ఆపరేషన్‌లో బీజాపూర్‌లోని తర్లగూడ తెలంగాణ సరిహద్దు వద్ద మావోయిస్టు తారస పడ్డారు.
ఇరు వర్గాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఎస్ఎల్ఆర్, ఏకే-47 రైఫిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్,తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఒకరి పేరు బద్రు అలియాస్ కల్లు.. చత్తీస్‌గఢ్ దక్షిణ బస్తర్ డివిజన్ మావోయిస్టు నేత. మరొకరు కమ్మా. మహారాష్ట్ర గడ్చిరోలి డివిజన్ మావోయిస్టు నేతగా పోలీసులు తెలిపారు.
జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్ 18 తెలుగు, ములుగు జిల్లా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Encounter, Mulugu, Naxals, Telangana, Telangana Police