జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి..

మృతులను మహబూబాబాద్‌కు చెందిన పెనుగొండ గణేష్‌, సుకన్య ,మహమ్మద్‌ నజీర్‌గా గుర్తించారు. గాయపడ్డవారిని మంజుల,శ్రీలతగా గుర్తించారు.

news18-telugu
Updated: September 19, 2019, 9:42 AM IST
జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని దేవరుప్పుల సమీపంలో కారు,డీసీఎం ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను మహబూబాబాద్‌కు చెందిన పెనుగొండ గణేష్‌, సుకన్య ,మహమ్మద్‌ నజీర్‌గా గుర్తించారు. గాయపడ్డవారిని మంజుల,శ్రీలతగా గుర్తించారు. గాయపడ్డవారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సందర్శంచిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. డీసీఎం అతివేగం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading