హోమ్ /వార్తలు /తెలంగాణ /

ACCIDENT: సిద్దిపేట జిల్లాలో మద్యం తాగి లారీ యాక్సిడెంట్ చేసిన డ్రైవర్..ముగ్గురు బలి

ACCIDENT: సిద్దిపేట జిల్లాలో మద్యం తాగి లారీ యాక్సిడెంట్ చేసిన డ్రైవర్..ముగ్గురు బలి

(నిర్లక్ష్యం ఖరీదు మూడు ప్రాణాలు)

(నిర్లక్ష్యం ఖరీదు మూడు ప్రాణాలు)

ACCIDENT: సిద్దిపేట జిల్లాలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కడు మద్యం తాగి వాహనం నడిపినందుకు రెండు కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయాయి. స్థానికంగా ఈఘటన అందర్ని ఎంతగానో కలచివేసింది.

  (K.Veeranna,News18,Medak)

  జీవితంలో ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న దంపతులు ఓ వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా బంధువు, ఆత్మీయులకు శాశ్వతంగా దూరమయ్యారు. మరో వారం రోజుల్లో విదేశాలకు ప్రయాణమైన వృద్ధ దంపతులు ప్రాణాల పాలిట యముడిలా దాపురించాడు ఓ లారీ డ్రైవర్. సిద్దిపేట(Siddipeta)జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తప్పు ఒకరు చేస్తే ...ముగ్గురికి శిక్ష పడింది. ఫలితంగా వాళ్ల బంధువులకు కన్నీటిని మిగిల్చింది. కరీంనగర్(Karimnagar)పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్Retired Teacher తాండ్ర పాపారావు(Tandra Paparao), పద్మ(Padma) దంపతులు కరీంనగర్ నుంచి ఓ ప్రైవేట్ కారులో హైదరాబాద్‌(Hyderabad)కు బయల్దేరారు. నాగుల మల్యాల(Nagula Malayala)కు చెందిన గొంటి ఆంజనేయులు(Gonti anjaneyulu)కారు నడుపుతున్నాడు. మల్లారం(Mallaram)శివారు ప్రాంతంలో ఎదురుగా రాంగ్‌ రూట్‌లో వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. ఈదుర్ఘటనలో కారులోని డ్రైవింగ్ చేస్తున్న ఆంజనేయులతో పాటు దంపతులు పాపారావు,పద్మ అక్కడిక్కడే మృతి చెందారు.

  లారీ డ్రైవర్‌ చేసిన నేరం..

  ప్రమాదానికి కారణం లారీ డ్రైవర్ నిర్లక్ష్యమేనని మృతుల బంధువులు ఆరోపించారు. లారీ డ్రైవర్ మద్యం తాగి ఉండటమే కాకుండా రాంగ్‌ రూట్‌లో లారీని నడిపి వేగంగా కారును ఢీకొట్టడంతో కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులోని ముగ్గురు చిక్కుకుపోయారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్తలానికి చేరుకొని క్రేన్‌ సాయంతో కారును బయటకు తీయించారు. మృతులు పాపారావు, పద్మ దంపతులు మరో వారం రోజుల్లో అమెరికాకు వెళ్లేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. రెండేళ్ల క్రితమే విదేశాల్లో స్తిరపడ్డ కుమారుడు ప్రితమ్‌రావుకి కొడుకు పుట్టడంతో మనవడ్ని చూడాలని అమెరికాకు వెళ్లాలనుకున్నారు. ఈలోపే మృత్యువు కబళించడంతో రెండు కుటుంబాల సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.

  (నిర్లక్ష్యం ఖరీదు మూడు ప్రాణాలు)

  రెండు కుటుంబాలకు నష్టం..

  ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అఫ్పగించారు. మృతురాలు పద్మ సోదరుడు శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లారీ డ్రైవర్ వనపర్తి జిల్లా జూరాలకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. ఇదే ప్రమాదంలో చనిపోయిన కారు డ్రైవర్ గొంటి ఆంజనేయులుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. మద్యం మత్తులో లారీ డ్రైవర్ చేసిన నిర్లక్ష్యానికి ముగ్గురు మృతి చెందడమే కాకుండా రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

  లారీ డ్రైవర్ని శిక్షించాలని డిమాండ్..

  తప్పతాగి లారీ నడపటమే నేరం. అందులో రాంగ్‌ రూట్‌లో వచ్చి కారును ఢీకొట్టి ముగ్గురు ప్రాణాలు పోవడానికి కారణమైన లారీ డ్రైవర్ శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల బంధువులు మాత్రం అతనికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Car accident, Siddipeta

  ఉత్తమ కథలు