రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి!

ఏలూరు నుంచి ఓ పేషెంట్‌ను అంబులెన్స్‌లో హైదరాబాద్ తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ నలుగరిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.

news18-telugu
Updated: January 11, 2019, 8:55 AM IST
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి!
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: January 11, 2019, 8:55 AM IST
రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆదిభట్ల వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రావిరాల ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో శంషాబాద్ నుంచి బొంగులూరు వైపు వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి అంబులెన్స్‌ను ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్‌లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ఏలూరు నుంచి ఓ పేషెంట్‌ను అంబులెన్స్‌లో హైదరాబాద్ తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ నలుగరిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. కారు డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...